ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. పాజిటీవ్ కేసులు గత రెండు రోజులుగా తగ్గుతున్నా మరణాల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ప్రజలను హెచ్చరిస్తోంది. తాజాగా దేశంలో 2,81,386 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,49,65,463కి చేరింది. ఇందులో 2,11,74,076 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 35,16,997 కేసులు ఇంకా యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో 4,106 మంది మృతి చెందారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,74,390కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,78,741 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు కేంద్రం బులిటెన్‌లో పేర్కోన్నది. ఇకపోతే, ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. ఇప్పటి వరకు మొత్తం 18,29,26,460 మందికి వ్యాక్సిన్‌ను అందించారు.
ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు… 4016 మరణాలు
