NTV Telugu Site icon

India Corona Bulletin : 6,915 కొత్త కేసులు.. మరణాలెన్నంటే..?

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించిన డేటా ప్రకారం.. భారతదేశంలో ఒకే రోజు 6,915 కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్లు పెరిగాయి. దేశంలోని మొత్తం కేసుల సంఖ్య 4,29,31,045కి చేరుకుంది. అయితే యాక్టివ్ కేసులు 60 రోజుల తర్వాత లక్ష కంటే తక్కువకు పడిపోయాయి. 24 గంటల్లో 180 కొత్త మరణాలు నమోదవడంతో మరణాల సంఖ్య 5,14,023కి చేరుకుంది. దేశంలో యాక్టివ్‌ కేసులు 92,472కి తగ్గాయి.

ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్‌లలో 0.22 శాతం ఉన్నాయి. అయితే దేశంలో రికవరీ రేటు మరింత మెరుగుపడి 98.59 శాతానికి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. రోజువారీ పాజిటివిటీ రేటు 0.77 శాతంగా నమోదైంది. అయితే వారపు పాజిటివిటీ రేటు 1.11 శాతంగా నమోదైంది. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,23,24,550కి చేరుకోగా, మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది.