Site icon NTV Telugu

Bharat: చాలా తక్కువ ధరలోనే హెచ్ఐవీ డ్రగ్

Untitled Design (3)

Untitled Design (3)

హెచ్ఐవీ కి సంబంధించిన మెడిసిన్ భారత్ అత్యంత చౌకగా అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఔషదం ధర అమెరికాలో దాదాపు 3.5 మిలియన్లు, కానీ భారత దేశంలో దీన్ని చాలా తక్కువ ధరకే ఉత్పత్తి చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. HIV (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్-AIDS) ఔషధం భారతదేశంలో తయారు చేయబడుతుంది. ఈ ఔషధం ధర అమెరికాలో దాదాపు ₹3.5 మిలియన్లు, కానీ భారతదేశంలో 3,300లకే అందుబాటులోకి తీసుకురానుంది ప్రభుత్వం. భారతీయ జనరిక్ ఔషద కంపెనీలు ఈ డ్రగ్ ను ఉత్పత్తి చేసేందుకు అన్ని రకాల లైసెన్స్ లు, టెక్నికల్ సపోర్ట్ ను పొందాయి. దీంతో పేద, మధ్య-ఆదాయ దేశాలకు సరసమైన ధరలకు అందుబాటులో ఉంటుంది.

నివేదికల ప్రకారం.. లెనాకాపావిర్ అనే ఔషధం ఇప్పటికే ఆఫ్రికా, ఆసియా వంటి దేశాలలో HIV సంక్రమణకు చికిత్స చేయడానికి ఉపయోగించబడుతోంది. ఇది యునైటెడ్ స్టేట్స్, కెనడా, యూరప్ మరియు ఇతర ప్రాంతాలలో HIV సంక్రమణకు చికిత్సగా సన్లెంకా బ్రాండ్ పేరుతో అమ్ముడవుతోంది. అద్భుత ఔషధంగా పిలువబడే భారతీయ కంపెనీలు హెటెరో ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ఇటీవల దాని జెనరిక్ వెర్షన్‌ను ఉత్పత్తి చేయడానికి ఆమోదం పొందాయి.

ఈ ఔషధ ఉత్పత్తికి గేట్స్ ఫౌండేషన్ కూడా మద్దతు ఇస్తుంది. భారతదేశం 2027 నాటికి ఈ ఔషధాన్ని జనరిక్ రూపంలో అందుబాటులోకి తెస్తుంది. న్యూఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన సీనియర్ డాక్టర్ ముకుల్ మాట్లాడుతూ.. లెనాకాపావిర్ అనేది ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇచ్చే ఇంజెక్షన్, ఇది HIV నివారణ, చికిత్స రెండింటికీ ప్రభావవంతంగా ఉంటుందని అన్నారు. క్లినికల్ ట్రయల్స్‌లో, HIV సంక్రమణను నివారించడంలో ఇది 99% వరకు విజయవంతమైందని తేలింది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేధిక ప్రకారం… భారతదేశంలో దాదాపు 25.4 లక్షల మంది HIVతో జీవిస్తున్నారు. అలాగే, ప్రతి సంవత్సరం దాదాపు 68 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. 2023 సంవత్సరంలో, దాదాపు 35,870 మంది HIV కారణంగా మరణించారు. అనేక రాష్ట్రాల్లో, ఈ ఇన్ఫెక్షన్ ప్రాబల్యం రేటు జాతీయ సగటు 0.20% కంటే చాలా ఎక్కువ. 2023-24 సంవత్సరంలో, దాదాపు 16.9 లక్షల మంది యాంటీరెట్రోవైరల్ థెరపీలో ఉన్నారు.

Exit mobile version