INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
- ఎన్నికల సంఘంపై ఇండీ కూటమి కొత్త యాక్షన్ ప్లాన్
- అక్టోబర్ 6న ఈసీ కార్యాలయానికి అన్ని ప్రతిపక్ష ఎంపీల మార్చ్
- అక్టోబర్ 2-8 మధ్య నిరసన కార్యక్రమాలు
- అక్టోబర్, నవంబర్‌లో 5 భారీ ర్యాలీలకు ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA Bloc: ఎన్నికల సంఘంపై విమర్శలు, ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్ నేపథ్యంలో ఈ రోజు(బుధవారం) ఇండీ కూటమి కీలక సమావేశాన్ని నిర్వహించింది. అక్టోబర్ 06న అన్ని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు కలిసి కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి మార్చ్ నిర్వహించున్నట్లు ప్రకటించింది. ఎస్ఐఆర్ వివారం, ఓటర్ల జాబితాలో మార్పులు, ఎన్నికల సంఘం నిర్ణయ ప్రక్రియపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఢిల్లీలో మార్చ్‌తో పాటు అక్టోబర్, నవంబర్ నెలల్లో దేశవ్యాప్తంగా 5 భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఓటర్ల హక్కులకు కలుగుతున్న నష్టాన్ని ప్రజలకు వివరించడమే ఈ ర్యాలీలు ముఖ్య లక్ష్యమని ఆయన అన్నారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పార్లమెంట్ నుంచి వీధి పోరాటాలు, నిరసనలు, దేశవ్యాప్త ర్యాలీలు, సుప్రీంకోర్టు వరకు తమ కార్యాచరణ ఉంటుందని ఇండీ కూటమి ప్రకటించింది.
Also Read
- Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
ఇండీ కూటమి నవంబర్ 1న ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించి, ‘‘ఓట్ చోరీ’’పై తమ ఆరోపణల్ని ప్రజల ముందుకు తీసుకెళ్తామని ఖర్గే చెప్పారు. రాజ్యాంగ వ్యవస్థల పనితీరుపై తమ అభ్యంతరాలను వివరించేందుకు అక్టోబర్ రెండో వారంలో రాష్ట్రపతిలో సమావేశం కోరినట్లు ఖర్గే వెల్లడించారు. ఎన్నికల సంఘం సహా ఇతర రాజ్యాంగ సంస్థలు తమ స్వతంత్రతను కోల్పోతున్నాయని రాష్ట్రపతికి వివరించనున్నట్లు తెలిపారు.
SIR, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పెండింగ్ కేసుల్ని త్వరగా విచారించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ఇండీ కూటమి నిర్ణయించినట్లు ఖర్గే చెప్పారు. రాహుల్ గాంధీ గత రెండేళ్లుగా ఎన్నికల్లో ‘‘ఓట్ చోరీ’’ గురించి ఆరోపిస్తున్న విషయాన్ని ఖర్గే పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా పలు సందర్భాల్లో ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ఆయన అన్నారు.
తాజావార్తలు
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
-
EPFO New Rules: అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!+
-
Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!