NTV Telugu Site icon

భారత్ లో మరో ఔషధం అందుబాటులోకి…త్వరలో దిగుమతి 

భారత్ లో కరోనా మహమ్మారి ఎంతగా విజృంభిస్తోందో చెప్పాల్సిన అవసరం లేదు.  పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.  కరోనా కట్టడికి ఇప్పటికే మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.  అటు గుజరాత్ కు చెందిన జైకోవ్ డి వ్యాక్సిన్ కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నది.  ఇక ఇదిలా ఉంటె ఇప్పుడు మరో ఔషధాన్ని ఇండియా డ్రగ్స్ కంట్రోల్ అనుమతులు మంజూరు చేసింది.  

యాంటీబాడీ కాక్ టైల్ ఔషధం త్వరలోనే ఇండియాకు దిగుమతి కానున్నది.  ఈ ఔషధాన్ని గతంలో ట్రంప్ వినియోగించారు.  అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ కరోనా బారిన పడ్డారు.  ఆ సమయంలో ట్రంప్ కు ఈ ఔషధాన్ని వైద్యులు సూచించారు.  స్విట్జర్లాండ్ కు చెందిన రోచ్ సంస్థ ఈ ఔషధాన్ని తయారు చేసింది.  సిప్లా కంపెనీ ఇండియాలో దీనిని పంపిణి చేయనున్నది.  కరోనా లక్షణాలు, తక్కువ తీవ్రత ఉన్న వ్యక్తులకు ఈ యాంటిబాడీ కాక్ టైల్ మెడిసిన్ ను వినియోగించనున్నారు.