NTV Telugu Site icon

INDIA Alliance: మోడీని ప్రశ్నించే గొంతు ఇప్పుడెందు లేవదు.. “కోల్‌కతా వైద్యురాలి” ఘటనపై ఇండియా కూటమి మౌనం..

Kolkata Doctor Murder Case

Kolkata Doctor Murder Case

INDIA Alliance: కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అత్యంత పాశవికంగా 31 ఏళ్ల మహిళా వైద్యురాలిపై అత్యాచారం జరిగింది. నైట్ డ్యూటీ సమయంలో ఆమెపై ఈ దారుణం జరిగింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి సెమినార్ హాలులో శుక్రవారం ఉదయం ఆమె మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా మెడికోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు కఠినంగా శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు నేతలు కూడా కోల్‌కతా వైద్యురాలి ఘటనపై పెద్దగా స్పందించడం లేవు. ఇండియా కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ భాగస్వామిగా ఉండటమే ఇందుకు కారణమని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఘటన జరిగిన నాలుగైదు రోజుల తర్వాత నిన్న కాంగ్రెస్ నేత ప్రియాంకాగా గాంధీ, చర్యలు తీసుకోవాలని మమతా బెనర్జీని కోరారు. ఈ రోజు స్పందించిన రాహుల్ గాంధీ.. ‘‘ బాధితురాలికి న్యాయం చేయడానికి బదులు నిందితులను రక్షిస్తున్నారు’’ అంటూ సుతిమెత్తగా విమర్శలు చేశారు.

అయితే, ఈ వ్యవహారం ఇండియూ కూటమి నేతలు ఎందుకు స్పందించడం లేదని బీజేపీ ప్రశ్నిస్తోంది. అవినీతిపరులు, రేపిస్టులను మాత్రమే రక్షించే కూటమి ‘‘ఇండియా కూటమి’’ అని, ఇది మహిళా వ్యతిరేక కూటమని, పశ్చిమ బెంగాల్ లో మహిళా ముఖ్యమంత్రి ఉన్నప్పటికి న్యాయం జరగడం లేదని బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ ఆరోపించారు. ఉత్తర్ ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత 15 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడితే ఆ పార్టీలు మాట్లాడటం లేదని విమర్శించారు. బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ విషయంలో మాత్రం ఆ పార్టీలు మౌనం వహిస్తున్నాయని మండిపడ్డారు.

Read Also: Rahul Gandhi: “నిందితులను రక్షించే ప్రయత్నం”.. కోల్‌కతా డాక్టర్ ఘటనలో మిత్రపక్షంపై విమర్శలు..

ఇదిలా ఉంటే, బీజేపీ, ఎన్డీయే కూటమిని పలు అంశాల్లో విమర్శించే టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ఈ ఘటనపై ప్రశ్నించినందుకు ఏకంగా ఓ జర్నలిస్టునే బ్లాక్ చేసింది. కోల్‌కతా రేప్ ఘటనపై టీఎంసీ నేతల్ని విమర్శి్స్తూ ఒక పోస్టులో జర్నలిస్ట్ అజిత్ అంజుమ్ మహువా మోయిత్రాను బుధవారం ట్యాగ్ చేశారు. ‘‘ బెంగాల్ డాక్టర్‌పై జరిగి క్రూరత్వానికి సంబంధించిన ప్రశ్నతో నేను మహువా మోయిత్రాను ట్యాగ్ చేసినప్పుడు, ఆమె నన్ను బ్లాక్ చేసింది. వాహ్, మేడమ్, వాహ్! మీరు ప్రతిరోజూ మోడీ ప్రభుత్వాన్ని పదునైన విమర్శలతో ప్రశ్నిస్తున్నారు, కానీ నేను మీ స్వంత ప్రభుత్వం గురించి ఒక్క ప్రశ్న అడిగిన వెంటనే మీరు నన్ను బ్లాక్ చేసారు. మీరు ఒక్క ప్రశ్న కూడా హ్యాండిల్ చేయలేదా?’’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ ఘటనపై స్పందించని మీరు, రేపు యూపీ, బీహార్ లేదా ఇతర రాస్ట్రాల్లో జరిగే అత్యాచార ఘటనపై వ్యాఖ్యానించే హక్కు లేదు అని ఆయన అన్నారు.

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య ‘‘మమతా బెనర్జీ, టీఎంసీ ప్రభుత్వ పర్యవేక్షణలో జరిగిన భయంకరమైన సంఘటన నిర్భయ పార్ట్ 2 కంటే తక్కువ కాదు’’ అని బీజేపీ ఆరోపించింది. జర్నలిస్టును బ్లాక్ చేయడంపై మహువా మోయిత్రా నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ‘‘”ప్రతిపక్ష నేతల గొంతులను అడ్డుకున్నందుకు లోక్‌సభలో ఓం బిర్లాను నిరంతరం లక్ష్యంగా చేసుకునే మహువా మొయిత్రా, బెంగాల్ భయానకత గురించి ఆమె ప్రశ్నలను అడగితే ఎక్స్‌లో ప్రజల్ని బ్లాక్ చేస్తుంది’’ అని ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.