Site icon NTV Telugu

Actor Darshan: దర్శన్ కేసులో కీలక పరిణామం.. రేణుకాస్వామి చిత్రహింసల ఫోటోలు వైరల్..

Renuka Swamy

Renuka Swamy

Actor Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ వ్యవహారం ఆ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నటి పవిత్ర గౌడతో దర్శన వ్యవహారంపై అతని అభిమాని రేణుకాస్వామి పదే పదే అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడనే కోపంతో చిత్రదుర్గ నుంచి కిడ్నాప్ చేసి బెంగళూర్ తీసుకువచ్చి దాడి చేసి చంపేశారు. ఈ ఘటనలో దర్శన్‌, పవిత్ర గౌడలతో పాటు మొత్తం 10 మందికి పైగా నిందితులు అరెస్ట్ అయ్యారు.

ఇదిలా ఉంటే, తాజాగా దాడి సమయంలో రేణుకాస్వామి ఎలా చిత్ర హింసలు అనుభవించాడని సూచించే ఫోటోలో వైరల్‌గా మారాయి. ఒంటిపై చొక్కా లేకుండా ఏడుస్తున్న ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. పార్క్ చేసిన ట్రక్కు ముందు కూర్చుని కన్నీరు పెట్టుకున్నారు. మరో చిత్రంలో అతడి చొక్కా, నీలిరంగు జీన్స్ ధరించి ట్రక్కు ముందు అపస్మారక స్థితిలో కనిపిస్తున్నాడు. దర్శన్ సహాయకుడు పవన్ ఫోన్‌లో ఈ ఫోటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ లీకైన ఫోటోలపై పోలీసులు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

Read Also: Dan Bilzerian with Girls: అబ్బబ్బబ్బ.. బాసూ..! ఒక్క రోజైనా నీలా బతకాలి.. అందమైన మోడల్స్.. లెక్కలేనంత డబ్బు..

దర్శన్, అతడి గ్యాంగ్ చేసిన దారుణమైన దాడిలో రేణుకాస్వామి మరణించాడు. పోస్టుమార్టం నివేదికలో స్వామి తీవ్రగాయాల వల్ల చనిపోనట్లు వెల్లడించింది. ఎముకలు విరిగిపోయాయి. అతని శరీరంపై మొత్తం 39 గాయాల గుర్తులు ఉన్నాయి. బాధితురాలి తలపై లోతైన కోత కూడా ఉంది. ఈ దారుణమైన దాడితో రేణుకాస్వామి పదేపదే స్పృ‌హ తప్పిపోయినప్పుడు, అతడికి కరెంట్ షాక్ పెట్టి మేల్కొనేలా చేశారు. హత్య చేసిన తర్వాత డబ్బు, తన పరపతిని ఉపయోగించి, స్వామి మృతదేహాన్ని మాయం చేయడానికి, సాక్ష్యాలు నాశనం చేయడానికి యత్నించినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో మొత్తం 17 మంది అరెస్టయ్యారు. జూన్ 09న బెంగళూర్ సుమనహళ్లిలోని మురుగునీటి కాలువలో అతడి మృతదేహం లభించింది.

Exit mobile version