IIT Madras: దేశంలో అత్యున్నత విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్.. వరసగా ఐదో ఏడాది ఫస్ట్ ర్యాంక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IIT Madras: దేశంలో అత్యున్నత విద్యాసంస్థ మరోసారి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), మద్రాస్ ర్యాంక్ సాధించింది. వరసగా ఐదో ఏడాది కూడా అగ్రస్థానంలో కొనసాగుతోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ 2023లో దేశంలోని వివిధ విద్యాసంస్థలకు ర్యాంకుల్ని కేటాయించింది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) అత్యుత్తమ ర్యాంక్‌ను పొందింది. ఓవరాల్ గా అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్ మొదటి స్థానంలో నిలువగా.. ఐఐఎస్సీ బెంగళూర్ రెండో స్థానంలో, ఐఐటీ ఢిల్లీ మూడో స్థానంలో నిలిచాయి.
ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటీ మద్రాస్ వరసగా ఎనిమిదో సంవత్సరం కూడా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ విభాగంలో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే తర్వాత రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. కాలేజీల విభాగంలో ఢిల్లీ యూనిర్సిటీకి చెందిన మిరాండా హౌస్ మరియు హిందూ కళాశాల కళాశాలలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. చెన్నై ప్రెసిడెన్సీ కాలేజ్ తర్వాత మూడోస్థానంలో ఉంది.
Also Read
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
Read Also: AP CM Jagan: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో వచ్చిన పెట్టుబడులపై సీఎం జగన్ సమీక్ష
ఐఐఎస్ సీ బెంగళూర్ పరిశోధనకు ఉత్తమమైన సంస్థగా, ఐఐటీ కాన్పూర్ ఆవిష్కరణలకు ఉత్తమ ర్యాంక్ ను పొందాయి. మేనేజ్మెంట్ కాలేజీల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), అహ్మదాబాద్ అగ్రస్థానంలో ఉండగా, ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోజికోడ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఫార్మసీ విభాగంలో హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మొదటి స్థానంలో నిలిచింది. జామియా హమ్దార్ద్ మరియు బిట్స్ పిలానీ వరుసగా రెండు మరియు మూడు స్థానాల్లో నిలిచాయి. లా విద్యా సంస్థల్లో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, బెంగళూరు మొదటిస్థానంలో నిలువగా.. నేషనల్ లా యూనివర్శిటీ, ఢిల్లీ , నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా, హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
IIT Madras ranked best institution followed by IISC Bengaluru and IIT Delhi as per the NIRF Ranking released by the Union Ministry of Education pic.twitter.com/yAKN3uVnuU
— ANI (@ANI) June 5, 2023
NIRF rankings 2023 | IIT Madras ranked as the best engineering institution in the country.
Delhi University's Miranda House College ranked as the best college in the country pic.twitter.com/OhRk53Z8H0
— ANI (@ANI) June 5, 2023
తాజావార్తలు
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
-
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
-
Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
-
7 Seater Cars: మారుతి ఎర్టిగా నుంచి మహీంద్రా బొలెరో వరకు.. రూ.5.65 లక్షల నుంచి లభించే చౌకైన 7-సీటర్ కార్లు ఇవే
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!