Site icon NTV Telugu

IIT Madras: దేశంలో అత్యున్నత విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్.. వరసగా ఐదో ఏడాది ఫస్ట్ ర్యాంక్..

Iit Madras 2

Iit Madras 2

IIT Madras: దేశంలో అత్యున్నత విద్యాసంస్థ మరోసారి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), మద్రాస్ ర్యాంక్ సాధించింది. వరసగా ఐదో ఏడాది కూడా అగ్రస్థానంలో కొనసాగుతోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ 2023లో దేశంలోని వివిధ విద్యాసంస్థలకు ర్యాంకుల్ని కేటాయించింది. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) అత్యుత్తమ ర్యాంక్‌ను పొందింది. ఓవరాల్ గా అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్ మొదటి స్థానంలో నిలువగా.. ఐఐఎస్సీ బెంగళూర్ రెండో స్థానంలో, ఐఐటీ ఢిల్లీ మూడో స్థానంలో నిలిచాయి.

ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటీ మద్రాస్ వరసగా ఎనిమిదో సంవత్సరం కూడా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ విభాగంలో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే తర్వాత రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. కాలేజీల విభాగంలో ఢిల్లీ యూనిర్సిటీకి చెందిన మిరాండా హౌస్ మరియు హిందూ కళాశాల కళాశాలలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. చెన్నై ప్రెసిడెన్సీ కాలేజ్ తర్వాత మూడోస్థానంలో ఉంది.

Read Also: AP CM Jagan: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో వచ్చిన పెట్టుబడులపై సీఎం జగన్‌ సమీక్ష

ఐఐఎస్ సీ బెంగళూర్ పరిశోధనకు ఉత్తమమైన సంస్థగా, ఐఐటీ కాన్పూర్ ఆవిష్కరణలకు ఉత్తమ ర్యాంక్ ను పొందాయి. మేనేజ్‌మెంట్ కాలేజీల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం), అహ్మదాబాద్ అగ్రస్థానంలో ఉండగా, ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోజికోడ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ఫార్మసీ విభాగంలో హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మొదటి స్థానంలో నిలిచింది. జామియా హమ్దార్ద్ మరియు బిట్స్ పిలానీ వరుసగా రెండు మరియు మూడు స్థానాల్లో నిలిచాయి. లా విద్యా సంస్థల్లో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, బెంగళూరు మొదటిస్థానంలో నిలువగా.. నేషనల్ లా యూనివర్శిటీ, ఢిల్లీ , నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా, హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Exit mobile version