NTV Telugu Site icon

Supreme Court: ‘‘రాహుల్ గాంధీ పేరు ఉన్నంత మాత్రాన’’.. ఒకే పేరుతో ఉన్న అభ్యర్థుల్ని నిషేధించలేం..

Supreme Court

Supreme Court

Supreme Court: ఎన్నికల్లో ఒకే పేరుతో ఉన్న అభ్యర్థుల్ని పోటీ నుంచి నిషేధించాలనే అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాజకీయ నేతల పేర్లతో ఉన్న అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపలేమని పేర్కొంది. రాజకీయ నాయకుల పేర్లతో ఉన్న అభ్యర్థులను నిషేధించాలని కోరుతూ పిటిషనర్ సాబు స్టీఫెన్ పిల్ దాఖలు చేశారు. ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు ఇలా ఒకే పేరు ఉన్న అభ్యర్థులు పలు ముఖ్య స్థానాల్లో పోటీ చేస్తున్నారని పిటిషనర్ వాదించారు. ఇలాంటి అభ్యర్థులు ఉండటం వల్ల ముఖ్య నాయకులు స్వల్ప తేడాతో ఓడిపోతున్నారని పిటిషనర్ చెప్పాడు. స్వేచ్ఛాయుతమైన మరియు నిష్పక్షపాతమైన ఎన్నికల ప్రక్రియ కోసం ఇలాంటి చర్యల్ని ఆపేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు.

Read Also: Jithender Reddy: జితేందర్ రెడ్డి ట్రైలర్ కు అనూహ్య స్పందన

దీనిపై విచారణకు నిరాకరించిన జస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్ లాగా తల్లిదండ్రులు అభ్యర్థులకు ఒకే రకమైన పేర్లు పెట్టినంత మాత్రాన వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎలా అడ్డుకుంటారు’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒకే రకమైన పేర్లతో ముఖ్య నాయకులు పోటీ చేస్తున్న స్థానాల్లో పలువురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ధోరణులు ఎన్నికల్లో కనిపిస్తున్నాయి. కీలక నాయకులు గెలుపోటములను దెబ్బతీయాలనే ఆలోచనలో ఇలా చేస్తున్నారు.

ఉదాహరణకు ఇటీవల తమిళనాడు రామనాథపురం లోక్‌సభ స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం(ఓపీఎస్) ఈ సారి ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. అయితే అభ్యర్థుల జాబితాలో ఇదే పేరుతో నలుగురు పన్నీర్ సెల్వంలు ఉన్నారు. ఓచప్పన్ పన్నీర్ సెల్వం, ఒయ్యా తేవర్ పన్నీర్ సెల్వం, ఓచా తేవర్ పన్నీర్ సెల్వం, మరియు ఒయ్యారం పన్నీర్ సెల్వం, వీరంతా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు.

Show comments