NTV Telugu Site icon

Kerala Twins: ‘జీన్స్’ సీన్ రిపీట్.. కవల సోదరుల్ని పెళ్లి చేసుకున్న కవల సోదరీమణులు

Twins

Twins

సినిమాల్లోని సీన్స్స్ నిజ జీవితంలో జరిగినప్పుడు ఆశ్చర్యం కలుగకమానదు. ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా ‘జీన్స్’ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కవలలు, కవలలనే పెళ్లి చేసుకుంటారు. తాజాగా జీన్స్ మూవీలోని సీన్ రిపీట్ అయ్యింది. ఇద్దరు కవల సోదరీమణులు, ఇద్దరు కవల సోదరులను పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో కవల జంటలు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

Also Read:Odela 2: మహా కుంభమేళాలో ‘ఓదెల 2’ టీజర్ లాంఛ్

కవల అమ్మాయిలు, కవల అబ్బాయిలు అచ్చు గుద్దినట్టు ఒకేలా ఉంటారు. వీళ్లను గుర్తించాలంటే సాధ్యమయ్యే పనికాదు. వీళ్లను చూస్తే బాగా పరిచయం ఉన్న వాళ్లు కూడా గుర్తించడం కష్టమే. వారి అలవాట్లు, ఇష్టాలు ఒకేలా ఉంటాయి. కేరళకు చెందిన ఈ కవల సోదరీమణులు కూడా అలాంటివాళ్లే. ఈ కవలలు పెళ్లి చేసుకున్నారు. తమలాగే అచ్చం ఒకేలా ఉండే కవల సోదరులనే వివాహం చేసుకున్నారు. పెళ్లిలో ఈ కవల జంటలు ధరించిన దుస్తులు కూడా ఒకేలాగా ఉన్నాయి. వేద మంత్రాల సాక్షిగా ఈ కవల జంటలు ఒక్కటయ్యారు. ఈ నూతన కవల జంటలకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జీన్స్ మూవీలోని సీన్ రియల్ అయ్యిందని కొందరు, ఇదంతా దేవుడి ప్లాన్ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.