హిమచల్ ప్రదేశ్ ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఐఏఎస్ అధికారులను బడి బాట పట్టించనుంది. ఇక నుంచి హిమచల్ ప్రదేశ్ అధికారులంతా సర్కారు బడికెళ్లి పాఠాలు బోధించాలి. తమ అనుభవాలను విద్యార్థులకు బోధించనున్నారు. భవిష్యత్ గురించి సరైన మార్గనిర్దేశనం చేయనున్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు, మౌలిక వసతుల పరంగా ఏమైనా లోపాలున్నాయా… ? అని తెలుసుకునేందుకు హిమచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది.
దీన్లో భాగంగా అఖిల భారత సర్వీసు(ఐఏఎస్) అధికారులతో పాటు హిమచల్ అడ్మినిస్ర్టేటివ్ సర్వీస్ (హెచ్‌ఏఎస్) అధికారులను బడిబాట పట్టించనుంది. ప్రతి రెండు వారాలకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది. అధికారులు వారి పరిధిలోని ప్రతి పాఠశాలకు వెళ్లి సమస్యలను పరిశీలించడంతోపాటు వాటిని పరిష్కరించాల్సి ఉంటుందని హిమచల్ ప్రదేశ్ సర్కార్ తెలిపింది.
