భారత వాయుసేనలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. ఎయిర్ కమొడోర్ సంజయ్ శర్మ, ఆయన కుమార్తె ఫ్లయింగ్ ఆఫీసర్ అనన్య శర్మ హాక్ ఏజేటీ ఫైటర్ జెట్‌ను నడిపి రికార్డు సృష్టించారు. యుద్ధ విమానాన్ని నడిపిన మొట్టమొదటి తండ్రీకూతుళ్లుగా నిలిచారు. తండ్రీకూతుళ్లు ఫైటర్ జెట్ ముందు ఫోజులిస్తున్న ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్ వైరల్ అవుతోంది.
మే 30వ తేదీన కర్ణాటకలో బీదర్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో హాక్-132 ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఈ తండ్రీకూతుళ్లు ప్రయాణించి చరిత్ర సృష్టించారు. ఓ మిషన్ కోసం ఇలా తండ్రి, కుమార్తె ఒకే యుద్ధ విమానంలో కలిసి ప్రయాణించడం ఇదే మొదటిసారి అని వాయుసేన వెల్లడించింది. తండ్రి సంజయ్‌తో కలిసి ఒకే యుద్ధ విమానంలో ప్రయాణించడంతో అనన్య కల సాకారమైనట్లయ్యింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బీటెక్ పూర్తి చేసిన అనన్య శర్మకు సైన్యంలో చేరి, యుద్ధ విమానాలను నడపాలని చిన్ననాటి నుంచి కోరిక ఉండేది. అందుకు ఆమె తండ్రి సంజయ్ శర్మే ఆమెకు స్ఫూర్తిగా నిలిచారు. 2016లో భారత వైమానిక దళంలో తొలి మహిళా ఫైటర్ పైలట్ బ్యాచ్‌లో స్థానం సంపాదించి తన కోరిక నెరవేర్చుకున్నారు. ఆ తర్వాత ఫ్లైయింగ్ బ్రాంచ్ శిక్షణకు ఎన్నికయ్యారు. అనుభవజ్ఞులైన పైలట్ల పర్యవేక్షణలో కఠోర శిక్షణ పొంది కిందటేడాది డిసెంబర్‌లో ఫైటర్ పైలట్‌గా నియామకం పొందారు. తన జీవిత కాల లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు.
Agnipath: నేవీ అగ్నివీర్ సైలర్ పోస్టుల్లో 20 శాతం మహిళలే..
అనన్య ప్రస్తుతం బీదర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో శిక్షణ పొందుతోంది. తండ్రీకూతురు కలిసి యుద్ధ విమానం ముందు దిగిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు వారికి అభినందనలు తెలుపుతున్నారు.
AIR COMMODORE SANJAY SHARMA and his daughter ANANYA SHARMA became the first father-daughter pair in the #IndianAirForce to fly in formation of the Hawk AJT in Bidar.
GLORIOUS PAST PROMISING FUTURE @IAF_MCC pic.twitter.com/HCpAKSmGv3
— Vikas Manhas (@37VManhas) July 5, 2022