Site icon NTV Telugu

Husband Catches Wife Red Handed: స్కూటీలో మరొకరితో భార్య.. వెంబడించిన భర్త.. వీడియో వైరల్

Husband Catches Wife Red Handed

Husband Catches Wife Red Handed

Husband Catches Wife Red Handed: కాపురాలు కూలడానికి అసలు కారణం ఏంటి? భార్య, భర్తల మధ్య అన్యోన్యత లేకపోవడమా? ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడమా? జీవించడానికి సరైనా డబ్బు సమస్యా? లేక జీవితంలో మనస్సాంతి లేక ఇలాంటి వివాహేతర సంబధాలకు కారణమౌతున్నాయా? అంటే అవుననే చెప్పాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఏమో గానీ.. నువ్వా నేనా అన్నట్లు తయారైంది వివాహ జీవితం. ఆనందం ఏమో గానీ, కలతలే తప్పా ఆకాలంలో అన్యోన్యత అనే పదం మనం వినడం చాలా అరుదుగా మారింది. దీంతో.. వివాహేతర సంబంధాలతో కాపురాలు కూలిపోతున్నాయి. ఇద్దరు కలకాలం కాపురం చేసుకోవాల్సిన వాళ్లు, దారి తప్పి ప్రవర్తిస్తున్నారు. దీంతో.. ఎన్ని ఘాతుకాలకైనా పాల్పడుతున్నారు. తప్పని తెలిసిని అయినా సరే మళ్లీ మళ్లీ జరుగుతున్నాయి. ఓ భార్య గుట్టును బయటపెట్టాడు భర్త. వెంబడించి మరీ పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రాలో చోటుచేసుకుంది.

వారిద్దరికి పెళ్లై పదేళ్లు, ఒక కుమార్తె కూడా ఉంది. కానీ.. భార్య ఓ వ్యాపారవేత్తతో సంబంధం పెట్టుకుంది. ఆవిషయం కాస్త భర్తకు తెలియడంతో రెండు రోజుల పాటు వారిద్దరికి ఇంట్లో గొడవలు జరిగాయి.. సెప్టెంబర్ 11న వారి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. దీంతోఆమె భర్తకు మాట మాత్రం చెప్పకుండా.. కుమార్తెను కూడా పట్టించుకోకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. భర్త.. ఆందోళనకు గురయ్యాడు.. భార్యను వెదికేందుకు కుమార్తెను తీసుకుని స్కూటీపై బయల్దేరాడు. వెతుకున్న భర్తకు తన భార్య ద్వయం కైలాష్‌ మందిర్ రోడ్ వద్ద స్కూటీపై మరొక వ్యక్తితో చూశాడు. నల్ల చొక్కా, లేత గోధుమరంగు ప్యాంటు ధరించిన ఓ వ్యక్తి బైక్ నడుపుతుండగా, తనన వెనుక వైట్ ప్రింటెడ్ సల్వార్ కుర్తాలో తన భార్య వెనుక కూర్చుంది.

అలా చూడటంతో భర్తకు విపరీతమైన కోపం వచ్చింది. వారిద్దరిని వెంబడించాడు.. అదే స్పీడులో వెళ్లి.. భార్యతో బైక్‌ నడుపుతున్న వ్యక్తి బండి ఆపమని అరిచాడు. కానీ వాళ్లు పట్టించుకోలేదు. దాంతో బైక్ వేగం పెంచి.. వారిని చేజ్ చేసి పడ్డుకున్నాడు. నడిరోడ్డు మీదే వారిద్దరిని చెప్పుతో కొట్టడమే కాకుండా.. భార్యను, ఆమె ప్రియుడిని కూడా చితకబాదాడు. భర్త వద్ద నుంచి తప్పించుకుని వారిద్దరూ అక్కడ నుంచి పరుగులు తీశారు. భర్త అయినా వదల్లేదు. రోడ్డు మీదే చితకబాదుతుండటంతో.. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇరువురికి వారికి భారీ జరిమానా విధించారు. రోడ్డుపై పబ్లిక్‌ను డిస్టర్బ్ చేసే విధంగా ప్రవర్తించడంతో ఫైన్ వసూలు చేశారు. ఈ విడియో అంతా రికార్డు కావడంతో.. రాహుల్‌ అహిర్‌ అనేవ్యక్తి వీడియోను పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈవీడియో వైరల్‌ గా మారింది.

Exit mobile version