Site icon NTV Telugu

JK Encounter: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. మానవ జీపీఎస్‌గా పేరు గాంచిన ఉగ్రవాది హతం

Jk

Jk

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. పహల్గామ్ ఉగ్ర దాడి నుంచి భారత సైన్యం ముష్కరుల కోసం వేట కొనసాగిస్తోంది. ఇప్పటికే కీలక ఉగ్రవాదులందరినీ భారత సైన్యం హతమార్చింది. తాజాగా మరొక ఎన్‌కౌంటర్ జరిగింది. 100కు పైగా చొరబాటు ప్రయత్నాలు వెనుక ఉన్న మానవ జీపీఎస్‌గా పేరు గాంచిన కీలక ఉగ్రవాది బాగు ఖాన్‌ను సైన్యం అతమార్చింది.

ఇది కూడా చదవండి: Trump: ట్రంప్‌కు సీరియస్!.. జోరుగా ప్రచారం

శనివారం గురేజ్ ప్రాంతంలో సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మానవ జీపీఎస్‌గా పేరు గాంచిన బాగు ఖాన్‌ భద్రతా దళాలకు తారసపడ్డాడు. దీంతో సైన్యం జరిపిన కాల్పుల్లో బాగు ఖాన్ అలియాస్ సమందర్ చాచా హతమయ్యాడు. ఇతడు 100కు పైగా చొరబాటు ప్రయత్నాలకు మూల కారకుడని సైన్యం పేర్కొంది. 1995 నుంచి పీవోకేలో స్థిరపడ్డాడు. చొరబాట్లలో ఇతడు అత్యంత ప్రభావవంతమైన సూత్రధారుల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు. నౌషెరా నార్ ప్రాంతంలో మరొక ఉగ్రవాదితో కలిసి చొరబాటుకు ప్రయత్నిస్తుండగా భద్రతా దళాలు హతమార్చాయి.

ఇది కూడా చదవండి: Delhi Horror: ప్రసాదంపై వివాదం.. ఆలయ సేవకుడు హత్య

Exit mobile version