Site icon NTV Telugu

Gold Biscuits: లగేజ్ బ్యాగ్ లో బిస్కెట్లు.. తినేవి కాదండోయ్‌

Gold Biscuits

Gold Biscuits

Gold Biscuits: టెక్నాలజీ మహిమో.. లేక ఇంటర్నెట్ వాడకమో గానీ స్మగ్లర్లు తెలివి మీరిపోతున్నారు. కాప్స్ అడ్డుతగులుతున్నా.. క్రియేటివిటీకి మాత్రం పదునుపెట్టి తమ స్మగ్లింగ్ దందాలను కొనసాగిస్తున్నారు. అతి తెలివి ఉపయోగించి బంగారాన్ని దేశవిదేశాలకు తరలించేందుకు పక్కా ప్లాన్‌ వేస్తున్నారు. కొందరు షూష్‌లో తరలిస్తుంటే మరికొందరైతే బెల్ట్‌ల్లో, పేస్టులద్వారా బంగారాన్ని తరలించేందుకు ప్లాన్స్‌ వేస్తుంటారు. అయితే ఒక్కటి మాత్రం మరిచిపోతారు. ఎక్కడి నుంచి వెళ్లిన కస్టమ్స్ అధికారులు, పోలీసులు ఉంటారని వారినుంచి తప్పించుకోవడం అంత ఈజీ పనికాదని మరిచి బంగారాన్ని తరలించేందుకు వ్యూహాలు, ప్లాన్‌ లు వేస్తూ ఇట్టే దొరికిపోతుంటారు.వాళ్లు నిర్వహించే రెక్కిలో చివరికి స్మగ్లర్లు దొరికిపోవడం.. కథ కంచికి చేరడం జరుగుతుంటుంది. ఇలాంటి ఘటనే ముంబాయి ఎయిర్‌పోర్ట్‌ లో జరిగింది. తన లగేజీ బ్యాగులో బిస్కెట్లను తరలిస్తున్నారు. అయితే ఏంటి అనుకుంటే మాత్రం అది పొరపాటే.. అతను తరలిస్తున్నది మామూలు బిస్కెట్లు కాదండోయ్‌ బంగారం బిస్కెట్లు అండీ బాబు..

Read also: Inorbit Mall: అటు వెళ్లకండి.. వెళ్తే మాత్రం ఇరుక్కుంటారు జాగ్రత్త

ముంబాయి ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టుకున్నారు కష్టమ్స్‌ అధికారులు. ఒక వ్యక్తిని అనుమానం వచ్చి తనిఖీలు చేయాగా షాక్‌ తిన్నారు. తన లగేజ్‌ బ్యాగ్‌ లో బంగారం బిస్కెట్లను చూసి అవాక్కయ్యారు. ప్రయాణికుడు ఏమాత్రం తెలియకుండా తన లగేజీ బ్యాగులో 4.75 కోట్ల విలువ చేసే 9.5 కేజీల బంగారం బిస్కెట్లు తరలించేందుకు పక్కా ప్లాన్‌ అక్కడి నుంచి జారుకునేందుకు ప్రయత్నించాడు. కష్టమ్స్‌ అధికారులు అతన్ని అదుపులో తీసుకున్నారు. తన లగేజ్‌ బ్యాగ్‌ను చెక్‌ చేయాలని అడిగారు. అయితే తినిఖీ చేసేందుకు ప్రయాణికుడు అస్సలు ఒప్పుకోకపోవడంతో.. అనుమానం మరింతగా మారింది. దీంతో కస్టమ్స్‌ అధికారులు ప్రయాణికుడి లగేజ్‌ బ్యాగ్‌ను తెరవగా.. తన లగేజ్‌లో బంగారం బిస్కెట్లు ఉండటంతో అతడిని అదుపులో తీసుకున్నారు. బంగారాన్ని సీజ్‌ చేశారు. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన స్కానింగ్ లో బంగారం గుట్టు రట్టు బట్ట బయలైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్ అధికారులు. అయితే అతను ఎవరికోసం బంగారం బిస్కెట్లు తరలిస్తున్నాడనే విషయం పై ఆరా తీస్తున్నాడు. ఇలా బంగారం తరలించడం ఎప్పటి నుంచి చేస్తున్నాడనేది ఇంకా తెలియాల్సి ఉందని కస్టమ్స్‌ అధికారులు అంటున్నారు.
Jubilee Hills Crime: అమ్మాయిలతో కలిసి కారులో షికారు.. మత్తులో ఉండటంతో షాకింగ్ ఘటన

Exit mobile version