Howrah Police: నేరస్థుల గుండెల్లో సువేందు సర్కార్ రైళ్లు.. పేరుమోసిన నేరస్థుడిని లోదుస్తుల్లో తీసుకెళ్లిన హౌరా పోలీసులు
- నేరస్థుల గుండెల్లో సువేందు సర్కార్ రైళ్లు
- నేరస్థులపై పోలీసులు కఠిన చర్యలు
- పేరుమోసిన నేరస్థుడిని లోదుస్తుల్లో తీసుకెళ్లిన హౌరా పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లో అధికార మార్పు తర్వాత రాష్ట్రంలో నేరస్థులపై పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. హౌరా నగరంలో పేరుమోసిన నేరస్థుడు ఆకాష్ సింగ్‌ను హౌరా పోలీసులు అదుపులోకి తీసుకుని లోదుస్తుల్లో వీధుల్లో ఊరేగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు ఆకాష్ సింగ్‌ను మాలిపంచ్ఘరా, గోలబారి పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు నేరస్థలాలకు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు.
గతంలో జరిగిన నేరాలను ఛేదించే క్రమంలో, అతను నేరాలను ఎలా ప్లాన్ చేశాడు? ఎవరి సహాయం తీసుకున్నాడు? వంటి అంశాలపై దర్యాప్తు అధికారులు విచారణ చేపట్టారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య నిందితుడిని ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లిన పోలీసులు, ఘటనలకు సంబంధించిన వివరాలను పరిశీలించారు.
Also Read
- CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
అధికార మార్పు తర్వాత వేగంగా చర్యలు
పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసి అధికారంలోకి వచ్చింది. పార్టీ నేత సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాష్ట్రంలో నేరాలపై జీరో-టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. దీనిలో భాగంగా నేరస్థులపై వేగంగా చర్యలు తీసుకోవడంతో పాటు, అక్రమ ఆక్రమణలపై కూడా కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో చట్టవ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?