NTV Telugu Site icon

చిన్నపిల్లల్లో కరోనా… లక్షణాలను ఎలా గుర్తించాలి… 

చిన్న పిల్లలకు కరోనా సోకుతుందా వస్తే వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి.  కరోనా సోకిన పిల్లలను ఎలా గుర్తించాలి అనే విషయాలపై కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.  మొదటిదశలో కరోనా కేవలం 4శాతం మంది పిల్లల్లో కనిపించగా, సెకండ్ వేవ్ సమయంలో 15 నుంచి 20శాతం మంది పిల్లల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ జరిగింది.  ఇది మూడో వేవ్ లో 80శాతం మంది పిల్లలకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు.  జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, దగ్గు, గొంతునొప్పి, శ్వాసను వేగంగా తీసుకోవడం,వికారం, వాంతి, విరోచనాలు, రుచిని కోల్పోవడం, ఆహారం సరిగా తీసుకోకపోవడం వంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తే వెంటనే కరోనా టెస్టులు చేయించాలి.