దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో కరోనా బూస్టర్ డోస్ వేసుకుంటే సురక్షితంగా ఉండొచ్చని పలు అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని కొన్ని దేశాలు బూస్టర్ డోస్ ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాయి. భారత్‌లోనూ త్వరలో బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. తొలుత హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లకు బూస్టర్ డోస్ ఇస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. హెల్త్ వర్కర్లకు బూస్టర్ డోస్ ఇచ్చిన తర్వాతే సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
Read Also: రూపాయి విలువ తగ్గడానికి కారణం ఎవరు?
అయితే కరోనా రెండు డోసులు వేసుకున్నవారు బూస్టర్ డోస్ ఎప్పుడు తీసుకోవాలన్నదానిపై అందరిలోనూ సందిగ్ధం నెలకొంది. కరోనా టీకా రెండో డోస్, బూస్టర్ డోస్ మధ్య 9 నుంచి 12 నెలల గ్యాప్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. త్వరలోనే దీనిపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం కరోనా ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ మధ్య మూడు నెలల విరామం పాటించడం మంచి ఫలితాలను ఇస్తుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఇప్పటివరకు భారత్‌లో 61 శాతం మంది కరోనా రెండు డోస్ వ్యాక్సిన్లు వేయించుకున్నారని అధికారులు నివేదిక సమర్పించారు.
