Site icon NTV Telugu

దళితుడని మ్యాన్‌హోల్‌ క్లీన్‌ చేయమన్న హాస్పిటల్‌ సిబ్బంది.. ఆ తరువాత..

బెంగుళూరులోని ప్రముఖ ఆసుపత్రిలో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది మురుగు కాల్వలను తొలగించడానికి మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేయమని దళిత ఉద్యోగిని బలవంతం చేసినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. హాస్పిటల్ హౌస్ కీపింగ్ సూపర్‌వైజర్ డి. రాజా, గిల్బర్ట్ తో పాటు అడ్మినిస్ట్రేటర్‌ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ప్రివెన్షన్ యాక్ట్ -1989లోని సెక్షన్ 3(1) (జె), ప్రొహిబిషన్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజింగ్ అండ్ రిహాబిలిటేషన్ సెక్షన్‌లు 7,8,9 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అయితే ఆసుప్రతిలో 21 ఏళ్లుగా పనిచేస్తున్న దైవాదీనం (53) అనే వ్యక్తిని ఆసుపత్రిలోని ముగ్గురు సిబ్బంది మ్యాన్‌హోల్‌ క్లీన్‌ చేయాలని ఒత్తిడి తీసుకువచ్చారు. క్లీన్‌ చేయకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరించడంతో అనారోగ్యంతో ఉన్న దైవాదీనం మ్యాన్‌హోల్‌ను క్లీన్‌ చేశాడు. అయితే అనంతరం దైవాదీనం కర్ణాటక సమతా సైనిక్ దళ్‌ను ఆశ్రయించారు. దీంతో సమతా సైనిక్ దళ్‌, బాధితుడు దైవాదీనం తరపున సాంఘిక సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూధన కెఎన్ ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసుకున్నారు.

Exit mobile version