Site icon NTV Telugu

Horlicks: హార్లిక్స్ ఇక ‘‘హెల్త్ డ్రింక్’’ కాదు.. ఏం జరిగింది..?

Horlicks

Horlicks

Horlicks: హిందూస్థాన్ యూనిలీవర్ ప్రొడక్స్ అయిన హార్లిక్స్ హెల్త్ డ్రింక్ ట్యాగ్ కోల్పోయింది. హెల్త్ డ్రింక్ కేటగిరీ నుంచి ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’గా మార్చింది. హార్లిక్స్, బూస్ట్ వంటి ప్రసిద్ధ ఉత్పత్తులను కలిగి హిందూస్థాన్ యూనిలీవర్ దాని హెల్త్ డ్రింక్ కేటగిరిని రీ బ్రాండ్ చేసింది. హెల్త్ డ్రింక్ నుంచి ఫంక్షనల్ న్యూట్రీషియన్ డ్రింక్స్ (FND)గా మార్చింది. హార్లిక్స్ హెల్త్ లేబుల్‌ని తొలగించింది. ఇటీవల కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్స్ నుంచి హెల్త్ డ్రింక్‌ని తొలగించాలని కోరింది. ఈ చర్య తర్వాత హార్లిక్స్ మాతృసంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

Read Also: Jagga Reddy: ఏఐసీసీ కంటే తోపులు ఎవరూ లేరు.. జగ్గారెడ్డి, కోదండ రెడ్డి సమక్షంలో చేరికలు

ఏప్రిల్ 24న విలేకరుల సమావేశంలో, HUL యొక్క చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రితేష్ తివారీ ఈ ప్రకటన చేసారు. కేటగిరి మార్పు కేటగిరి యొక్క ఖచ్చితమైన, పారదర్శక వివరణను అందిస్తుందని చెప్పారు. ఫంక్షనల్ న్యూట్రీషియన్ డ్రింక్స్ కేటగిరి ప్రోటీన్స్, మైక్రో న్యూటిషీయంట్స్ అవసరాలను అందిస్తుంది. మొక్కలు, జంతువు, సముద్ర లేదా సూక్ష్మజీవుల మూలాల నుంచి ఏదైనా బయోయాక్టివ్ కాంపోనెంట్‌ని చేర్చడం ద్వారా అదనపు ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఏదైనా ఆల్కహాల్ లేదా డ్రింక్స్‌ని FNDగా నిర్వచించవచ్చు.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం ‘హెల్త్ డ్రింక్స్’కి స్పష్టమైన నిర్వచనం లేదు. దీంతో ఇటీవల బోర్న్‌విటీ హెల్త్ డ్రింక్ కేటగిరీని తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు బోర్న్‌వీటాలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నాయనే ఆందోళనలు వచ్చిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) ఎంక్వైరీ తర్వాత ఒక నివేదికను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI)కి పంపింది. దీని తర్వాత కేంద్రం ఈ-కామర్స్ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Exit mobile version