Site icon NTV Telugu

Bomb Threat: కేంద్ర హోం శాఖకు బాంబు బెదిరింపు..

Home Ministry

Home Ministry

Bomb Threat: కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించి, ఏం లేదని తేల్చారు. న్యూఢిల్లీ ఏరియాలోని నార్త్ బ్లాక్ పోలీస్ కంట్రోల్ రూంకు బెదిరింపు మెయిల్ వచ్చింది. హోంశాఖ భవనం వద్దకు రెండు ఫైర్ ఇంజన్లను పంపించారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా నియంత్రణలో ఉన్న హోం మంత్రిత్వ శాఖను పేల్చేస్తామని బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో హోం శాఖ కొలువుదీరిన నార్త్ బ్లాక్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే అనుమానాస్పదమైంది ఏదీ కనిపించలేదని తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బెదిరింపు మెయిల్ గురించి పోలీసులకు సమాచారం అందింది.

Read Also: Priyanka Chopra : వామ్మో.. ప్రియాంక చోప్రా ధరించిన ఈ నెక్లేస్ ధర అన్ని కోట్లా?

ఇటీవల వరసగా దేశంలోని పలు నగరాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలోని దాదాపు 150 స్కూళ్లకు ఇలాగే బూటకపు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపు మోయిల్ హంగేరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పాఠశాల ఆవరణలో పేలుడు పదార్థాలు అమర్చామని మెయిల్‌లో పేర్కొనడంతో, స్కూల్ యాజమాన్యాలు పిల్లల్ని ఇళ్లకు పంపించారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు త్వరలోనే హంగేరి పోలీసుల్ని సంప్రదిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత జైపూర్, ఢిల్లీ సహా పలు నగరాల్లోని ఎయిర్‌పోర్టులను పేల్చేస్తామని బాంబు బెదిరింపులు వచ్చాయి. అహ్మదాబాద్ లోని పలు స్కూళ్లు కూడా ఇలాంటి బెదిరింపులను ఎదుర్కొన్నాయి.

Exit mobile version