Hoax bomb threats: నకిలీ బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. మంగళవారం పలు విమానాలకు ఆన్‌లైన్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంతో పాటు నాలుగు డొమెస్టిక్ విమానాలకు కూడా ఇదే తరహా బెదిరింపులను ఎదుర్కొన్నాయి. జైపూర్-బెంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, దమ్మం-లక్నో ఇండిగో, దర్భంగా-ముంబై స్పైస్‌జెట్, సిలిగురి-బెంగళూరు ఆకాస ఎయిర్ విమానాలకు బాంబు వచ్చాయి.
Read Also: Air india Express: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. అయోధ్యలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం, స్పైస్‌జెట్ విమానం, అకాస ఫ్లైట్, ఎయిర్ ఇండియా విమానాలకు ఎక్స్ వేదికగా థ్రెటెనింగ్ మెసేజులు వచ్చాయి. ఇవే కాకుండా సౌదీ అరేబియా నుండి వచ్చిన ఇండిగో విమానం బాంబు బెదిరింపుతో జైపూర్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దీంతో భద్రతా అధికారులు విమానాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, నకిలీ బాంబు బెదిరింపులుగా కొట్టిపారేశారు.
ఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న నాన్ స్టాప్ ఎయిరిండియా ఫ్లైట్‌కి బాంబు ఉందనే బెదిరింపులు రావడంతో విమానాన్ని కెనడాలోని ఒక మారుమూల ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు. అంతకుముందు సోమవారం కూడా ఇదే తరహాలో ముంబై నుంచి వచ్చే మూడు విమానాలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ పని చేసిన నిందితుల కోసం బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు మరియు పోలీసుల సంయుక్తంగా వెతుకుతున్నారు.