NTV Telugu Site icon

Bees attack: పెళ్లికి పిలువని ఆహ్వానితులు.. బంధువులు పరుగో పరుగు.. వీడియో వైరల్..

Bees Attack

Bees Attack

Bees attack: మధ్యప్రదేశ్‌లో షాకింగ్ సంఘటన జరిగింది. పెళ్లికి పిలువని ఆహ్వానితులుగా తేనెటీగలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా వివాహానికి హాజరైన బంధువులు ఉరుకులు పరుగులు పెట్టారు. తేనెటీగల దాడిలో 12 మంది గాయపడ్డారు. ఈ ఘటన గుణ జిల్లాలో ఒక వివాహ వేడుకలో జరిగింది. హోటల్ పైకప్పుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఒక్కసారిగా వేల సంఖ్యలో తేనెటీగలు విరుచుకుపడటంతో వాటి నుంచి తప్పించుకునేందేకు పెళ్లికి హాజరైన బంధువులు ఎటుపడితే అటు పరుగెత్తారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది.

READ ALSO: Yashasvi Jaiswal: య‌శ‌స్వీ డ‌బుల్ సెంచరీ.. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్! ఇంగ్లండ్ లక్ష్యం 557 పరుగులు

కస్తూరి గార్డెన్ హోటల్‌ పైకప్పుపై తేనెటీగలు నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. అయితే, అవి అక్కడ నుంచి వివాహం జరిగిన గార్డెన్‌లోకి ప్రవేశించి దాడి చేశాయి. చాలా మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక అధికారులు, అత్యవసర పరిస్థితిపై వెంటనే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వైద్య బృందాలు గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించారు. తీవ్రగాయాలపాలైన వారిని ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

Show comments