Site icon NTV Telugu

Himachal Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు లోయలో పడి 12 మంది మృతి..

Accident

Accident

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఒక ప్రైవేట్ ప్రయాణికుల బస్సు 400 మీటర్ల లోతైన లోయలో పడిపోవడంతో 12 మంది మరణించారు, మరో 35 మంది గాయపడ్డారు. సిర్మా జిల్లాలోని మారుమూల ప్రాంతమైన హరిపుర్ధార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బస్సు ఏటవాలుగా ఉన్న రోడ్డుపై నుంచి బస్సు జారిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు సోలన్ నుంచి రాజ్‌ఘడ్, హరిపుర్ధార్ మీదుగా కుప్వీకి వెళ్తోంది.

Read Also: Mahindra XUV 7XO లాంచ్.. వేరియంట్ వారీగా పూర్తి వివరాలు ఇలా..!

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఏటవాలుగా ఉన్న మలుపు దిగుతున్నప్పుడు డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గాయపడినవారిని సమీపంలోని హరిపుర్ధార్ ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రమాదంపై విచారణ వ్యక్తం చేశారు. ప్రమాదంపై ప్రధాని కార్యాలయం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం అందజేయబడుతుందని పీఎంఓ తెలిపింది.

Exit mobile version