Site icon NTV Telugu

Hijab Controversy: హిజాబ్‌ వివాదం.. పాఠశాల గుర్తింపు రద్దు చేసిన ఎంపీ సర్కార్‌

Hijab Controversy

Hijab Controversy

Hijab Controversy: రెండు రోజుల క్రితం హిజాబ్ వివాదం చెలరేగిన మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లోని గంగా జమున హయ్యర్ సెకండరీ స్కూల్ రిజిస్ట్రేషన్‌ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలను తనిఖీ చేసిన బృందం కనుగొన్న అంశాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. పాఠశాలలో తాగునీరు, బాలికలకు బాత్‌రూమ్‌లు సహా పలు లోపాలు ఉన్నట్లు తనిఖీల్లో తేలిందని పేర్కొంది. హిజాబ్ సమస్య కారణంగానే కాకుండా పాఠశాలలో అవకతవకల కారణంగా కూడా గుర్తింపు రద్దు నిర్ణయం తీసుకున్నట్లు దామోహ్ జిల్లా కలెక్టర్ మయాంక్ అగర్వాల్ తెలిపారు. అందువల్ల దీని రిజిస్ట్రేషన్‌ను వెంటనే రద్దు చేయాలని నిర్ణయించినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ముస్లిమేతర బాలికలు హిజాబ్‌లు ధరించమని ఆరోపించిన ఆరోపణలపై వివాదం తలెత్తింది. తలకు హిజాబ్‌ ధరించిన బాలికలను కలిగి ఉన్న పాఠశాల పోస్టర్‌ను ప్రదర్శించడం ఆగ్రహాన్ని రేకెత్తించింది. అయితే ఈ మాటలను పాఠశాల యజమాని ముస్తాక్ ఖాన్ ఆరోపణలను తోసిపుచ్చారు. పాఠశాల దుస్తుల కోడ్‌లో శిరోజాలు కనిపించకుండా స్కాఫ్ ధరించడం ఒక భాగమని అన్నారు. అయితే ఎవరూ వారిని ధరించమని బలవంతం చేయలేదని పేర్కొన్నారు. పాఠశాల రాష్ట్ర సిలబస్‌ను అనుసరిస్తుందని, జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏమీ బోధించలేదని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానం మాత్రమే రాష్ట్రంలో వర్తిస్తుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు.

మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలోని ఒక ప్రైవేట్ స్కూల్ బోర్డు పరీక్షలో తమ స్కూలు టాపర్‌ల పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో ముస్లింలు కాని కొంతమంది గర్ల్స్ స్కార్ప్స్ కట్టుకుని కనిపించారు. దీంతో పాఠశాలలో బాలికలందరినీ హిజాబ్ ధరించమని స్కూల్ యాజమాన్యం బలవంతం చేశారని ఆరోపించారు. ఈ మేరకు ఆ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ విషయాన్ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ ప్రియాంక్ కనూంగో దామోహ్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మే 30న తమకు ఎన్‌సిపిసిఆర్ ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. దీంతో దామోహ్ జిల్లా విద్యాశాఖాధికారి విద్యార్థుల కుటుంబాలను కలిశారని జిల్లా కలెక్టర్ తెలిపారు.అయితే, దీనిపై తల్లిదండ్రులెవరూ ఫిర్యాదు చేయలేదని అధికారులు తెలిపారు. అమ్మాయిల స్కూల్ డ్రెస్ కోడ్‌లో స్కార్ఫ్ లు, సల్వార్, కుర్తా ఉంటాయి. గంగా జమున హయ్యర్ సెకండరీ స్కూల్ ముస్లిమేతర బాలికలను హిజాబ్ ధరించమని బలవంతం చేసిందని ఆరోపిస్తూ వీహెచ్ పి, బజరంగ్ దళ్, ఏబీవీపీ సహా మితవాద సంఘాలు నిరసన తెలిపాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా విచారణకు ఆదేశించారు.
AP CM Jagan: ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి

Exit mobile version