Site icon NTV Telugu

Highway Robbers: సాధువుల వేషంలో.. హైవేలపై చోరీలకు పాల్పడుతున్న దొంగలు

Untitled Design (5)

Untitled Design (5)

ఈ మధ్య కాలంలో దొంగలు కొత్త రకం ట్రెండ్ ను ఫాలో అవుతూ చోరీలకు పాల్పడుతున్నారు. హైవేలపై సాధువుల వేషాలు వేసుకుని మరీ దొంగతనాలు చేస్తున్నారు. పొరపాటున వాహనాలు ఆపి వాళ్లు చెప్పింది చేశామంటే అంతే సంగతులు. ఉన్నదంతా దోచుకెళ్లి పోతారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Also:Cherry Fruits: చెర్రీ పండ్లు మీ ఆహారంలో చేర్చుకుంటే ఎన్ని లాభాలో తెలుసా..

అయితే మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో సాధువుల వేశంలో చోరీలకు పాల్పడుతున్నారు. దొంగలు.. ఆశీర్వదిస్తామని చెప్పి.. హైవేపై వెళ్తున్న కార్లను ఆపుతున్నారు. ఒకవేళ వాహనాన్ని ముందుకు కదిలిస్తే.. భస్మం చేస్తామని భయపెడుతున్నారు. కదలకుండా అక్కడే ఉండటంతో నిలువునా దోచేస్తున్నారు. కొద్ది రోజులుగా ఇలాంటి ఘటనలు పెరిగిపోవడంతో.. బాధితులు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. నిందితులు రాకేష్ రాజ్‌పుత్, బిర్జు నాథ్, రాముల్ నాథ్, రమేశ్ నాథ్, అరుణ్ నాథ్, మగన్ నాథ్, అలీ నాథ్‌గా గుర్తించారు. అనంరం నిందితులను రిమాండ్ కు తరిలించామని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version