వరుసగా దేశంలోని వివిధ ఎయిర్‌పోర్ట్‌లో భారీ ఎత్తున మాదకద్రవ్యాలు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది… ఇవాళ ఢిల్లీ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా హెరాయిన్‌ను పట్టుకున్నారు అధికారులు.. జోహాన్నెస్ బర్గ్ నుండి ఢిల్లీ వచ్చిన ఇద్దరు ఆఫ్రికన్ ప్రయాణికుల నుంచి 120 కోట్ల విలువ చేసే 18 కేజీల మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఏమాత్రం అనుమానం రాకుండా మాదకద్రవ్యాలను ట్రాలీ బ్యాగ్ కింది భాగంలో దాచారు కేటుగాళ్లు… మాదకద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు గుర్తు పట్టకుండా బుట్టలలో దాచి తరలించే ప్రయత్నం చేశారు.. సౌత్ ఆఫ్రికా నుండి మోసుకొని వచ్చిన మాదకద్రవ్యాలను ట్రాలీ బ్యాగ్ లో దాచి గ్రీన్ చానెల్ ద్వారా బయటకు చెక్కే సే ప్రయత్నం చేయగా.. అనుమానం వచ్చి అడ్డగించిన కస్టమ్స్ అధికారులు.. ట్రాలీ బ్యాగులో ఏముందని ప్రశ్నించారు.. పొంతన లేని సమాధానం ఇవ్వడంతో.. ఇద్దరిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారుల బృందం.. తమదైన శైలిలో ప్రశ్నించగా.. గుట్టు బయటపడింది.. ట్రాలీ బ్యాగ్ కింది భాగంలో వున్న మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఇద్దరిపై ఎన్ డి పీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.. ఇంత పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు ఎవరి కోసం తెచ్చారు అనే సమాచారాన్ని కూపి లాగుతున్నారు.. దీని వెనుక వున్న అసలు సూత్రధారిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
రూ.120 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత..

Heroin