NTV Telugu Site icon

Viral Video: ఈ పోలీస్ రియల్ హీరో.. ప్రాణాలకు తెగించి ఇద్దరిని కాపాడాడు

Uttarakhand

Uttarakhand

Heroic Cops Saved Two Youths In uttarakhand: ఓ పోలీస్ రియల్ హీరోగా మారారు. ప్రాణాలకు తెగించి ఇద్దరు యువకుల ప్రాణాలను కాపాడారు. ఉత్తరాఖండ్ పోలీస్ కు చెందిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఉత్తరాఖండ్ తనక్ పూర్ లోని శారదా ఘాట్ మధ్యలో చిక్కుకుపోయిన ఇద్దరు యువకులను ఉత్తరాఖండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన స్మిమ్మర్, మరో స్థానిక యువకుడు కలిసి రక్షించారు. ఈ ఘటన జరిగే సమయంలో నదీ ఒడ్డుపై ఉన్నవారు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో చూసిన నెటిజెన్లు సదరు పోలీస్, యువకుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read Also: Jammu Kashmir: కాశ్మీర్‌లో మొదలైన మార్పు.. స్వాతంత్య్రం తర్వాత తొలిసారి రికార్డు

వేగంగా ప్రవహిస్తున్న నదిలో కొట్టుకుపోతున్న ఇద్దరు యువకులను గమనించిన వ్యక్తి వెంటనే నదిలోకి దూకి కొట్టుకుపోతున్న ఇద్దరిని పట్టుకుని ఒడ్డుకు తీసుకువచ్చారు. ఇద్దరిని రక్షించిన రవీందర్ పెహల్వాన్, సూరజ్ లపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజెన్లు. ఈ వీడియోను ఉత్తరాఖండ్ పోలీసులు తమ ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు.

ఉత్తర ప్రదేశ్ లోని ఎటాహ్ కు చెందిన ఇద్దరు యువకులు శ్రీ మా పూర్ణగిరిని చూడటానికి వచ్చారని.. తనఖ్ పూర్ శారదాఘాట్ వద్ద నదిలో స్నానం చేయడానికి దిగిన సమయంలో నది ప్రవాహం ధాటికి కొట్టుకోయారని.. ఆ సమయంలో అక్కడే ఉన్న స్మిమ్మర్ రవీందర్ పెహల్వాన్, మరో వ్యక్తి సూరజ్ ఇద్దరిని రక్షించారని.. ప్రస్తుతం యువకులు ఇద్దరు సురక్షితంగా ఉన్నారని ఉత్తరాఖండ్ పోలీసులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ వీడియో అనేక నెటిజన్ల నుంచి లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. నెటిజెన్లు వీరిద్దరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘ అద్భుతం ఇద్దరు కూడా అవార్డుకు అర్హులని.. ఉత్తరాఖండ్ పోలీసులు గొప్పపని చేశారని.. గుడ్ జాబ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.