దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కరోనా లాక్‌డౌన్ కారణంగా జనసంచారం తక్కువగా ఉండటంతో పాటుగా, కాలుష్యం కొంతమేర తగ్గిపోవడంతో వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా జాతీయ రహదారుల వెంట ఉన్న కొండచరియలు విరిగిపడ్డాయి.
Read: ట్రెండింగ్ లో రవితేజ “రామారావు ఆన్ డ్యూటీ”
కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇకపోతే, హిమాచల్ ప్రదేశ్‌లో సోమవారం ఉదయం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ పర్యాటక క్షేత్రం ధర్మశాలలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తున్నది. ఈ భారీ వర్షాలకు ధర్మశాల రోడ్లు జలమయం అయ్యాయి. వరద నీరు పెరిగిపోవడంతో రోడ్లపై ఉంచిన కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంత వర్షం కురిసినా ధర్మశాలలో ఇలా ఎప్పడూ జరగలేదని స్థానికులు చెబుతున్నారు.
