Site icon NTV Telugu

Delhi: ఢిల్లీలో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్

Delhi Rains

Delhi Rains

Heavy rains in Delhi: ఢిల్లీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగర జీవితం మొత్తం అతలాకుతలం అయింది. గురువారం రోజు భారీ వర్షాలు కురవడంతో జనజీవితం స్తంభించింది. భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. శుక్రవారం కూడా నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం ఢిల్లీలో ఉదయం 8:30 నుండి సాయంత్రం 5:30 గంటల మధ్య 31.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. 8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. గురుగ్రామ్ ప్రాంతంలో ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని ప్రభుత్వం కోరింది.

Read Also: Kishan Reddy: మెదక్ – అక్కన్నపేట రైల్వే మార్గం ప్రారంభం.. హాజరుకానున్న బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులు

భారీ వర్షాల కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఇఫ్కో చౌక్, శంకర్ చౌక్, రాజీవ్ చౌక్, గుర్గావ్-ఢిల్లీ సరిహద్దు సమీపంలోని సర్హౌల్‌తో సహా, నేషనల్ హైవే 48లోని అనేక మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. శుక్రవారం కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు చేసింది. చాలా చోట్ల ఆకాశం మేఘావృతం అయి ఉంటుందని.. ఉరుములు,మెరుపులతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది. ఇక పొరుగు రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాల వల్ల ఇప్పటి వరు 13 మంది మరణించారు. 11 మంది గాయపడ్డారు. గోడకూలడం, పిడుగుపాలు వల్ల ఎక్కవ మరణాలు సంభవించాయి.

Exit mobile version