ఢిల్లీ అంతర్జాతీయ పోస్టాఫీసులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఆఫ్రికా నుండి ఢిల్లీ వచ్చిన ఓ పార్సిల్ లో 7.4 కోట్ల విలువ చేసే హెరాయిన్ డ్రగ్స్ గుర్తించారు కస్టమ్స్ అధికారులు. ఢిల్లీ లోని గుర్‌గావ్ అడ్రస్ కు పార్సిల్ వచ్చినట్లు గుర్తించారు అధికారులు. పార్సిల్ అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీలు చేసిన కస్టమ్స్ అధికారులు… పార్సిల్ ను అత్యాధునిక పరికరాలతో స్కానింగ్ చేయగా అందులో నిషేధిత డ్రగ్స్ బయటపడింది. చేతికి వేసుకునే గాజులలో డ్రగ్స్ ను నింపిన కేటుగాళ్లు… నింపిన డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా స్కెచ్ వేశారు.
read also : నేడు పుష్కర్ సింగ్ ధామియా ప్రమాణస్వీకారం
కానీ ఎట్టకేలకు ఢిల్లీ పోస్టాఫీసు లో డ్రగ్స్ గుట్టును రట్టు చేసిన కస్టమ్స్ అధికారులు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆఫ్రికా అడ్రస్ లో ఎవరు వుంటున్నారు? గుర్‌గావ్ అడ్రస్ లో ఎవరికి వచ్చింది అనే సమాచారాన్ని కూపి లాగుతున్నారు కస్టమ్స్ అధికారులు. అటు విమాన మార్గాల ద్వారా వస్తే పట్టుబడతామనే ఉద్దేశం తో కొత్త పద్దతులను అవలంబిస్తున్నారు స్మగ్లర్లు. కానీ.. స్మగ్లర్ల ఎత్తులకు…పై ఎత్తులు వేస్తూ… వారికి చెక్ పెడుతున్నారు కస్టమ్స్ అధికారులు.
