ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్ (హెరాయిన్) పట్టుబడింది. కాబూల్ నుండి ఢిల్లీ వచ్చిన ఆఫ్గన్ ప్రయాణీకుడి నుండి 2.4 కోట్ల విలువ చేసే 355 గ్రాముల మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా మాదకద్రవ్యాలను సినీ పక్కీలో తరలించే యత్నం చేశాడు ఆ కేటుగాడు. మాదక ద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు కనిపెట్టకుండా కారు ఇంజన్ లో వాడే పరికరాలలో దాచాడు.
read also : తెలకపల్లి రవి : చైనా కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవం – చారిత్రక ప్రభావం
కాబూల్ నుండి మోసుకొని వచ్చిన కారు ఇంజన్ బాగాల పై అనుమానం వ్యక్తం చేసిన కస్టమ్స్ అధికారులు…ఇంజన్ బాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పరికరాల్లో దాచిన తెల్లటి పౌడర్ ను అధికారులు కనుపెట్టారు. దీంతో ఆ నిందితున్ని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు.. మాదకద్రవ్యాలు ఎవరి కోసం తెచ్చారు అనే సమాచారాన్ని కూపి లాగుతున్నారు. దీని వెనుక వున్న అసలు సూత్రధారి పై లోతుగా విచారణ చేస్తోంది అధికారుల బృందం.
