Site icon NTV Telugu

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత..

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. ఉగాండాకు చెందిన ఓ మహిళ దుబాయ్ నుండి ఢిల్లీ చేరుకుంది. అయితే ఈ లేడీ కిలాడి ప్రొఫైల్ పై అనుమానం కలగడంతో కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తమదైన స్టైల్‌లో విచారణ చేయగా డ్రగ్స్ గుట్టు బయటపడింది. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా ట్రాలీ బ్యాగ్ నాలుగు పక్కల ప్రత్యేకంగా బాక్స్ లు ఏర్పాటు చేసి, అందులో 14 కోట్ల విలువ చేసే 2.2 కేజీల డ్రగ్స్ ను దాచింది.

అయితే స్కానింగ్ కు చిక్కకుండా డ్రగ్స్ ను ట్రాలీ బ్యాగ్ నాలుగు పక్కల దాచి కర్బన్ పేపర్ చుట్టింది. తనతో మోసుకొని వచ్చిన లగేజ్ బ్యాగ్ ను క్షుణ్ణంగా అధికారులు తనిఖీలు చేశారు. డ్రగ్స్‌ బయటపడడంతో డ్రగ్స్‌ను సీజ్ చేసి సదరు మహిళను అరెస్ట్ చేశారు. ఎన్‌డీపీఎస్‌ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

Exit mobile version