NTV Telugu Site icon

Supreme Court: రాహుల్‌ గాంధీ పిటిషన్‌పై విచారణ.. 21న లిస్ట్‌ చేసిన సుప్రీం కోర్టు

Supreme Court

Supreme Court

Supreme Court: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అభ్యర్థన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకారం తెలిపింది. కేసును విచారించేందుకు ఈ నెల 21న లిస్ట్‌ చేసింది. పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు అంగీకరించింది. ఈ నెల 21న విచారణ చేపడతామని మంగళవారం రాహుల్‌ గాంధీ తరపున న్యాయవాదికి సీజేఐ బెంచ్‌ స్పష్టం చేసింది. రాహుల్‌ గాంధీ తరపున సీనియర్‌ అడ్వొకేట్‌ అభిషేక్‌ మనూ సింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు. చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read also: Cyber Fraud: తల నొప్పిగా మారిన సైబర్ మోసాలు.. ఫిర్యాదుకు ప్రత్యేక హెల్ప్‌లైన్

2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలో నిర్వహించిన ర్యాలీలో మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకుగానూ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ ఈశ్వర్‌బాయ్‌ మోదీ సూరత్‌కోర్టులో దావా వేశారు. ఈ ఏడాది మార్చిలో ఆయన్ని దోషిగా తేలుస్తూ తీర్పు వెలువడిన విషయం తెలిసిందే. కోర్టు విధించిన శిక్ష రద్దు మరియు స్టే కోరుతూ రాహుల్‌ గాంధీ సెషన్స్‌ కోర్టుకు వెళ్లారు. కానీ కోర్టు అందుకు అంగీకరించలేదు. దీంతో.. గుజరాత్‌ హైకోర్టుకు వెళ్లారు. గుజరాత్‌ హైకోర్టు సైతం జులై 7వ ఆయనకు ప్రతికూలంగానే తీర్పు ఇచ్చింది. దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో శుక్రవారం వాదనలు జరగనున్నాయి. ఒకవేళ శిక్ష గనుక రద్దు అయితే.. రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ అయ్యే అవకాశం ఉంది. లేకుంటే ఆరేళ్ల దాకా ఆయన ఎన్నికల్లో పాల్గొనకుండా.. ఎన్నికలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి.