Hear Wave: ఉత్తర భారతదేశాన్ని ఎండలు భయపెడుతున్నాయి. రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లో వడగాలుల తీవ్రత పెరిగింది. ఉత్తర్ ప్రదేశ్‌లో ఎన్నికల విధుల్లో ఉన్న వారు పిట్టల్లా రాలిపోతున్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న 23 మంది హోంగార్డులు వడదెబ్బతో మీర్జాపూర్ మెడికల్ కాలేజీలో చేరాుర. ఇందులో ఆరుగురు మరణించినట్లు కాలేజ్ ప్రిన్సిపాల్ ఆర్బీ కమల్ తెలిపారు. హైబీపీ, గుండె సమస్యలు, ఇతర వ్యాధులతో వారంతా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం మరో ఇద్దరు జవాన్ల పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్లు వెల్లడించారు.
‘‘ఇప్పటి వరకు 23 మందిని మా వద్దకు పంపారు. వారిలో ఒకరు ఫైర్ సర్వీస్, ఒకరు సివిల్ పోలీస్ ఉన్నారు. 20 మంది హోంగార్డులు ఉన్నారు. ఆరుగురు జవాన్లు మరణించగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది’’ అని చెప్పారు. హైగ్రేడ్ ఫీవర్, హై బ్లడ్ ప్రెజర్, హై బ్లడ్ షుగర్ లక్షణాలతో వారిని తీసుకువచ్చారని, వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఇది ప్రాణాంతకం కావచ్చని మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ చెప్పారు.
Read Also: Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేప్ కేసులో ఎప్పుడు ఏం జరిగిందంటే..?
ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు వడదెబ్బతో మరణించారు. మరో 9 మంది అస్వస్థతకు గురయ్యారని అధికారలు చెప్పారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని జిల్లా కలెక్టర్ చంద్ర విజయ్ సింగ్ చెప్పారు. మరణానికి ఖచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ, వడదెబ్బ లక్షణాలు కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు శనివారం చివరి దశలో పోలింగ్ జరగనుంది. గత వారం రోజులుగా ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు ఎప్పుడూ లేని విధంగా పెరిగాయి. అనేక మంది వడదెబ్బతో మరణిస్తున్నారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో నిన్న రాజస్థాన్ వడదెబ్బతో మరణాలను సుమోటోగా స్వీకరించింది. వడగాలుల పరిస్థితిని జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరింది. బాధిత కుటుంబాలకు నష్టపరిహారాన్ని అందించాలని రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
