NTV Telugu Site icon

Haryana polls: హర్యానా ఎన్నికల తేదీ మార్పు! కొత్త తేదీ ఇదే

Haryanapolls

Haryanapolls

హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీలో మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రకటించిన అక్టోబర్ 1న కాకుండా అక్టోబర్ 5కు మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. తొలుత అక్టోబర్ 1న పోలింగ్, అక్టోబర్ 4న ఎన్నికల ఫలితాల విడుదలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. తాజాగా హర్యానా, జమ్మూకాశ్మీర్ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న విడుదల కానున్నాయి.

ఇది కూడా చదవండి:Crime News: క్రైమ్ సినిమా చూసి భార్య హత్య.. శరీరాన్ని ముక్కలుగా కోసి పలుచోట్ల పడేసిన భర్త

బిష్ణోయ్‌ కమ్యూనిటీ నుంచి వచ్చిన వినతి మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. గురు జంబేశ్వర్‌ స్మారకంగా అసోజ్‌ అమవాస్య పండగను ఘనంగా నిర్వహిస్తారు. అక్టోబర్‌ 2న జరిగే ఈ వేడుకలో హర్యానాతో పాటు, పంజాబ్‌, రాజస్థాన్‌కు చెందిన ఈ ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ పండుగలో పాల్గొంటారు. ఈ క్రమంలో తమ ఓటు హక్కును కోల్పోకూడదన్న ఉద్దేశంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్యంలో సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలన్న ఉద్దేశంతో పోలింగ్‌ తేదీలను మార్చినట్లు ఈసీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇది కూడా చదవండి: Indigo Flight: కోల్‌కతా ఎయిర్పోర్టులో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. కారణం ఏంటంటే..?

హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీ హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసింది. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్‌.. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీని ఓడించి ఈసారి ఎలాగైనా గద్దెనెక్కాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇక పదేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరగుతున్నాయి. ఇక్కడ 90 సీట్లు ఉన్నాయి. సెప్టెంబరు 18, 25, అక్టోబరు 1న మూడు దశల్లో పోలింగ్‌ జరగనుంది. అక్టోబర్ 8న కౌంటింగ్ జరగనుంది.

ఇది కూడా చదవండి: Viral video: నడిరోడ్డుపై ఈవ్‌టీజర్‌ను చితకబాదిన యువతులు