Haryana Exit Poll 2024: లోక్‌సభ ఎన్నికలు -2024 తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్, హర్యానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దీంతో అందరి ఆసక్తి ఈ ఎన్నికలపై నెలకొంది. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. బీజేపీ హ్యాట్రిక్ ఆశలు గల్లంతయ్యే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మొత్తం 90 స్థానాల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని చెబుతోంది. హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉంటే 46 మ్యాజిక్ ఫిగర్. ఈ సంఖ్య చేరుకున్న పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. అసలు ఫలితాలు అక్టోబర్ 08న వెలువడనున్నాయి.
మ్యాట్రిక్స్ సర్వే ప్రకారం.. బీజేపీకి 18-24, కాంగ్రెస్‌కి 56-62, జేజేపీకి 0-3 స్థానాలు వస్తాయని చెప్పింది.
పోల్ ఆఫ్ పోల్స్: బీజేపీ- 22, కాంగ్రెస్- 59 , జేజేపీ- 02
దైనిక్ భాస్కర్: బీజేపీ 15-29, కాంగ్రెస్ 44-54, జేజేపీ 0-1, ఆప్ 0-1, ఇతరులు 4-9
ధ్రువ్ రీసెర్చ్: బీజేపీ 22-32, కాంగ్రెస్ 50-64
పీపుల్స్ పల్స్: 20-32, కాంగ్రెస్ 49-61