Site icon NTV Telugu

Fuel Prices: అది నిజమే కావొచ్చు అంటున్న కేంద్ర మంత్రి..

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వార్తలపై స్పందించారు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పురి. ధరలు ప్రపంచ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయన్నారు. ఎన్నికల కోసమే ధరలు పెంచకుండా ఆపారన్న ప్రతిపక్షాల విమర్శలు కొంతవరకు నిజమే కావొచ్చన్నారు. ధరల పెంపుపై ఆయిల్ కంపెనీలే నిర్ణయం తీసుకుంటాయన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తుందన్నారు హర్‌దీప్‌ సింగ్ పురి. ఇక, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో దేశంలో ముడి చమురు కొరత ఉండదని, చమురు కంపెనీలే ఇంధన ధరలను నిర్ణయిస్తాయని అన్నారు. అయితే పౌరుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారాయన.. ముడి చమురు కొరత ఉండదని నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను.. మా అవసరాల్లో 85 శాతం ముడి చమురు దిగుమతులపై మరియు 50-55 శాతం గ్యాస్‌పై ఆధారపడి ఉన్నప్పటికీ, మా ఇంధన అవసరాలు తీరేలా చూస్తామని స్పష్టం చేశారు.

Read Also: Russia Ukraine War: యుద్ధ ఫలితం.. ఆంక్షలతో అల్లాడుతోన్న రష్యా..!

ఎన్నికల కారణంగా ఇంధన ధరలను కేంద్రం ముందుగానే తగ్గించిందని, ఎన్నికల తర్వాత మళ్లీ ధరలు పెంచుతారనే ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. గత ఏడాది కేంద్రం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 తగ్గించిందని గుర్తు చేశారు.. ప్రపంచవ్యాప్తంగా రేట్లు ఎందుకు పెంచారో అర్థం చేసుకోవడానికి ఉక్రెయిన్-రష్యా సంక్షోభం వంటి ఇతర పరిస్థితులను ప్రజలు గమనించాలని ఆయన అన్నారు. చమురు ధరలు ప్రపంచ ధరలను బట్టి నిర్ణయించబడతాయి.. ప్రపంచంలోని ఒక ప్రాంతంలో యుద్ధం లాంటి పరిస్థితి ఉంది.. చమురు కంపెనీలు దీనికి కారణమవుతాయి. చమురు కంపెనీలే ధరలను నిర్ణయిస్తాయి. మేము మంచి ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటాం అన్నారు.. కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి లాక్‌డౌన్‌ల కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయినప్పుడు, అంతర్జాతీయంగా చమురు ధరలు గణనీయంగా పడిపోయాయని ఆయన అన్నారు. కానీ ఇప్పుడు, ఉక్రెయిన్‌లో ఉద్రిక్తత, సైనిక చర్య కారణంగా, చమురు ధరలు పెరిగాయని.. చమురు కంపెనీలు ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటాయి అని మంత్రి చెప్పారు.

Exit mobile version