RSS: ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత ఇంద్రేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేవారు. ముస్లింలు, ఇతర మతాలకు చెందిన వ్యక్తులు అన్ని వివాదాస్పద మత స్థలాలను స్వచ్ఛందంగా హిందూ సమాజానికి అప్పగించాలని కోరారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రతి మసీదులో శివలింగాన్ని కనుగొనాల్సిన అవసరం లేదు’’ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యల్ని ఇంద్రేష్ కుమార్ ప్రస్తావించారు. మోహన్ భగవత్ చేసిన సంఘర్షణకు ముగింపు పలకడమే లక్ష్యంగా ఉందని, తద్వారా ద్వేషం, హింస నుంచి విముక్తి పొందినప్పుడు సమాజం దీని గురించి ఆలోచిస్తుందని ఆయన అన్నారు.
Read Also: Congress: రాహుల్ గాంధీ బాటలో ప్రధాని మోడీ.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు..
సనాతన ధర్మాన్ని అనుసరించేవారి దేవాలయాలను విదేశీ ఆక్రమణదారులు కూల్చివేశారని అన్నారు. ముస్లింలు, ఇతర మతాలకు చెందిన వ్యక్తులు ముందుకు వచ్చి వివాదాస్పద మతస్థలాలను హిందూ సమాజానికి అప్పగించాలని కోరారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంతో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుదని ఆయన అన్నారు. రామ మందరిం ప్రతీ ఒక్కరిదని, రాముడు అందరిలోనూ ఉన్నాడని, భారత్ అన్ని మతాలను అంగీకరించే, గౌరవించే దేశమని, అందుకనే రాముడి ఆలయాన్ని జాతీయ ఆలయంగా ప్రకటించాలని కోరారు.
