కరోనా థర్డ్ వేవ్ విజృంభణ క్రమంగా తగ్గిపోతోంది.. దీంతో.. కరోనా కేసులు భారీ ఎత్తున నమోదైన సమయంలో.. కఠిన ఆంక్షలు విధిస్తూ.. అమలు చేస్తూ వచ్చిన ఆయా రాష్ట్రలు ఇప్పుడు సడలింపులబాట పడుతున్నాయి.. తాజాగా, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను సడలించింది. సినిమా థియేటర్స్, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, యోగా కేంద్రాలను.. పూర్తి సామర్థ్యంతో నడుపుకోవచ్చని పేర్కొంది ప్రభుత్వం.. అయితే, ఇదే సమయంలో కోవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది.. రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్ పరిస్థితిపై టెక్నికల్ అడ్వైజరీ కమిటీతో సమావేశమైన సీఎం బొమ్మై… ఆ తర్వాత కోవిడ్ ఆంక్షలను సడలిస్తూ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు..
Read Also: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్స్‌పై నిషేధం.. ఎందుకంటే..?
కాగా, కోవిడ్ విజృంభణ తర్వాత.. కఠిన ఆంక్షలు చేపట్టిన కర్ణాటక ప్రభుత్వం.. నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్‌డౌన్ ఇలా ఆంక్షలు విధించింది.. ఇక, 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లకు అనుమతి ఇచ్చింది.. కానీ, ఇప్పుడు పూర్తి సామర్థ్యంతో సినిమా హాల్స్, స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, యోగా సెంటర్స్ నడుపుకోవడానికి అనుమతి ఇచ్చింది. అయితే, వాటిలో అడుగు పెట్టాలంటే మాత్రం.. వ్యాక్సిన్ వేయించుకొని ఉండాలి.. అది కూడా రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తిచేసుకొని ఉండాలి.. ఇక, థియేటర్లలో కోవిడ్ నిబంధనలను పాటించాలి.. మాస్కలు తప్పనిసరిగా ధరించాలని.. థియేటర్లలోకి ఆహార పదార్థాలను అనుమతించరాదని తాజాగా ఆదేశాల్లో పేర్కొంది ప్రభుత్వం.
