దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న జ్ఞానవాపి మసీదుపై సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. జ్ఞానవాపి మసీదు వీడియో గ్రఫీ సర్వేపై స్టే ఇవ్వాలని కోరుతూ అంజుమన్ ఇంతేజామియా మస్జీద్ వేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. మరోవైపు స్టే విధించాలని వేసిన పిటిషన్ కు వ్యతిరేఖంగా హిందూ సేన మరో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలను జారీ చేసింది.
వారణాసి కోర్ట్ లో మొదటి ట్రయల్ పూర్తయ్యే వరకు వేచి చూద్దాం అని సుప్రీం కోర్ట్ వ్యాఖ్యానించింది. శివలింగం దొరికిన ప్రాంతానికి రక్షణ కల్పించాలని వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ ను ఆదేశించింది. ఇదే విధంగా ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఆదేశించింది సుప్రీం కోర్ట్. అన్ని వర్గాలు సమతుల్యతను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మే 19కి వాయిదా వేసింది. కాగా స్టే విధించాలని అంజుమన్ ఇంతేజామియా మస్జీద్ దాఖలు చేసిన పిటిషన్ కు వ్యతిరేఖంగా పిటిషన్ వేసి హిందూ పిటిషనర్లకు, యూపీ ప్రభుత్వానికి సుప్రిీం కోర్ట్ నోటీసులు జారీ చేసింది. మే 19 లోగా రెస్పాండ్ కావాలని ఆదేశించింది.
ఇదిలా ఉంటే వారణాసి కోర్ట్ జ్ఞానవాపి సర్వేపై విచారణ చేసింది. సర్వే రిపోర్ట్ సమర్పించడానికి రెండ్రోజుల గడువు ఇచ్చింది కోర్ట్. సర్వే రిపోర్ట్ పూర్తి కాకుండా వివరాలను బయట పెట్టినందుకు సర్వే కమిషనర్ అజయ్ మివ్రాను తొలగించింది కోర్ట్. అజయ్ మిశ్రా సన్నిహితులు మీడియాకు రిపోర్ట్ లీక్ చేసినట్లు గుర్తించింది కోర్ట్. కాగా ఈనెల 14-16 వరకు జ్ఞానవాపి మసీదులో వీడియో సర్వేకు వారణాసి కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. మే 17న రిపోర్ట్ కోర్ట్ ముందుంచాలని ఆదేశించింది. అయితే మసీదులోని వజుఖానాలో శివలింగం బయటపడిందనే వార్తలు రాగానే… కోర్ట్ కమినర్లు రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి మరికొంత గడువును కోరారు. మరోవైపు ప్రస్తుత వ్యవహారాలపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అత్యవసరంగా సమావేశం అయింది. జ్ఞానవాపి మసీదు, జామియా మసీదు వంటి అంశాలపై చర్చించి.. కార్యచరణ రూపొందించనున్నట్లు తెలిసింది.