CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ

  • CEC జ్ఞానేష్ కుమార్‌, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు..
  • ఫారమ్-6లో మార్పులు, ఈసీఐ ఏకపక్ష నిర్ణయాలపై పిల్..
  • అక్టోబర్ 27న సుప్రీంకోర్టులో కీలక విచారణ..
Cec Gyanesh Kumar

Cec Gyanesh Kumar

CEC Gyanesh Kumar: ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన నిర్వహిస్తు్న్నాయి. మరోవైపు, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై అక్టోబర్ 27న విచారణ జరుగనుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి (ఈసీ), సీఈసీకి నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు సోమవారం ఈ ఉత్తర్వుల్ని జారీ చేసింది.

సోమవారం జరిగిన విచారణలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలన్నింటిని తాము పరిశీలిస్తామని, చట్టానికి విరుద్ధొంగా ఉన్నట్లు తేలితే ఏ నిర్ణయాన్నైనా కొట్టిపారేస్తామని చెప్పింది. ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండా ఎన్నికల సంఘం పలు నిర్ణయాలను తీసుకుందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉంటే, ఫారమ్-6లో ఎలాంటి మార్పుల్ని ఆమోదించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫారమ్ -6లో ఎవరు మార్పులు చేశారనే విషయాన్న పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.

ముఖ్యంగా ఫారమ్-6లో మార్పులు చేశారనే వ్యవహారం రాజకీయ వివాదంగా మారింది. ఫారమ్-6లో మార్పుల గురించి ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఫారమ్-6లో ఒక్క కామా, ఫుల్ స్టాప్ కూడా మార్చలేదని, ఎస్ఐఆర్ ఫారం-6కు అదనంగా ఒక డిక్లరేషన్ జత చేసినట్లు చెబుతోంది. జ్ఞానేష్ కుమార్ తదుపరి నిర్ణయాలు తీసుకోకుండా నిరోధించడంతో పాటు ఆయనను సస్పెండ్ చేయాలని మధ్యంతర ఉత్తర్వులను పిటిషనర్లు కోరినప్పటికీ.. ఈసీఐని సస్పెండ్ చేస్తే ఎవరు ఎన్నికల్ని నిర్వహిస్తారని కోర్టు ప్రశ్నించింది.