Gujarat Tourists Get Free Treatment In France Because Of Modi: ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందేందుకు ఎంత ఖర్చు అవుతుందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కేవలం చెకప్ చేయించుకోవడానికే వేలల్లో బిల్లు అవుతుంది. ఇక ఎమర్జెన్సీ కేసులకు అయితే.. లక్షలు పెట్టాల్సిందే! కానీ.. ఓ వ్యక్తికి మాత్రం ఉచితంగా వైద్యం అందింది. అది కూడా ఫ్రాన్స్‌లో! అంతర్జాతీయ ఆరోగ్య బీమా వల్ల ఇది సాధ్యమైందా? అంటే అదీ కాదు. మరి ఎలా? ప్రధాని మోడీ పుణ్యమా అని అతనికి ఫ్రీ ట్రీట్మెంట్ దొరికింది. ఎన్నో విలాసవంతమైన సౌకర్యాలు లభ్యమయ్యాయి. పదండి.. ఆ వివరాలేంటో తెలుసుకుందాం!
గుజరాత్‌కు చెందిన అనిల్ గోయల్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి యూరప్ టూర్ వెళ్లాడు. విహారయాత్రలో భాగంగా ఫ్రాన్స్‌కు వెళ్లగా.. అక్కడ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దాంతో కుటుంబసభ్యులు వెంటనే అతడ్ని అక్కడి స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అతనికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నప్పుడు.. ఆ వ్యక్తి గుజరాత్‌కి చెందినవాడని ఆసుపత్రి సిబ్బందికి తెలిసింది. అంటే.. నయా పైసా తీసుకోకుండా అనిల్ గోయల్‌కు మెరుగైన చికిత్స అందించారు. ఆసుపత్రిలోని సకల సౌకర్యాలన్నీ కల్పించారు. తమ సొంత వ్యక్తిలాగా ట్రీట్ చేస్తూ.. ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. వీఐపీ కంటే ఎక్కువగా రాజమర్యాదలు ఇచ్చారు.
అయితే.. ఇదంతా ఎందుకు? గుజరాత్ ప్రధాని మోడీకి చెందిన రాష్ట్రం కదా! వాళ్ల దృష్టిలో మోడీ ఒక గొప్ప ప్రపంచస్థాయి నేత. అలాంటి లీడర్ రాష్ట్రానికి చెందిన కావడంతో.. అనిల్ గోయల్ వాళ్లకు వీఐపీ పేషెంట్ అయ్యాడు. అత్యంత ఖరీదైన వైద్యం అందించి.. అతడ్ని మామూలు మనిషిని చేశారు. అది.. అసలు సంగతి. ఈ రేంజ్‌లో వీఐపీ ట్రీట్మెంట్ అందడంతో.. అనిల్ గోయల్ కుటుంబం సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.
