గుజరాత్‌లో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. మరోసారి ఓటర్లు ఏకపక్షంగా బీజేపీ వైపున నిలబడ్డారు. మొత్తం 15 కార్పొరేషన్లు ఉండగా అన్ని కార్పొరేషన్లను బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. పట్టణ, గ్రామీన ప్రాంతాల్లో బీజేపీకి ప్రజలు పట్టం కట్టారు.
ఆదివారం గుజరాత్‌లో 15 మున్సిపల్ కార్పొరేషన్లు, 84 మున్సిపాలిటీలు, 34 జిల్లా పంచాయతీలు, 260 తాలూకా పంచాయతీలకు పోలింగ్ జరిగింది. మంగళవారం ఉదయం కౌంటింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి కూడా బీజేపీ దూకుడు ప్రదర్శించింది. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన స్థానిక ఎన్నికల్లో భారీ విజయం సాధించడంతో బూస్ట్‌లాగా మారింది. కాషాయ పార్టీ మరోసారి తిరుగులేని చరిత్ర సృష్టించింది. ఇక చిఖ్డా పంచాయతీలో 16 స్థానాలకు గాను 15 స్థానాలను ఆప్ కైవసం చేసుకుంది.
