Site icon NTV Telugu

Gujarat: ముస్లిం మహిళలు ఎన్నికల్లో పోటీ చేయడం ఇస్లాంకు వ్యతిరేకం.. మతాన్ని బలహీన పరచాలనే ఇలా..

Gujarat

Gujarat

Gujarat Cleric Slams Muslim Women In Elections: ముస్లిం మహిళలను ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎంపిక చేసేవారు ఇస్లాంకు వ్యతిరేకం వ్యతిరేకంగా మతాన్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ గుజరాత్ రాష్ట్రానికి చెందిన మతాధికారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ రెండో విడత ఎన్నికలకు ముందు ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్ కు చెందిన జామా మసీద్ మతాధికారి షబ్బీర్ అహ్మద్ సిద్ధిఖీ మాట్లాడుతూ.. ఇస్లాంలో నమాజ్ కంటే ముఖ్యమైనది ఏదీ లేదని, మసీదుల్లో మహిళలు నమాజ్ చేయడం ఎప్పుడైనా చూశారా..? అంటూ ప్రశ్నించారు. ఇస్లాంలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉన్నందున వారు నమాజ్ చదవడానికి మసీదుకు రాకుండా ఆపారని అన్నారు. అందుకే ముస్లిం మహిళలకు ఎన్నికల టిక్కెట్లు ఇచ్చే వారు ఇస్లాంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారని అన్నారు.

Read Also: Himanta Biswa Sarma: మా తల్లుల గర్భం ఏమైనా వ్యవసాయ స్థలమా..? హిందూ వ్యతిరేక వ్యాఖ్యలపై ఫైర్

మీరు మహిళలనే ఎందుకు ఎంపిక చేస్తున్నారు.. మగవారు లేరా.? అంటూ ఎన్నికల పోటీ గురించి వ్యాఖ్యానించారు. మహిళలను ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లుగా చేస్తే మేము హిజాబ్ ను రక్షించలేమని ఇటీవల కర్ణాటకలో జరిగిన హిజాబ్ వివాదాన్ని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే మహిళలు హిందువులు, ముస్లిం ఇళ్లకు వెళ్లాలి.. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాని, అందుకు పురుషులకు ఎన్నికల టికెట్లు ఇవ్వాలని కోరారు. గుజరాత్ రాష్ట్రంలో రెండు విడతల్లో ఎన్నికలు ముగిశాయి. 93 నియోజకవర్గాలకు సోమవారం రెండో విడత ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రంలో 6.4 కోట్ల జనాభా ఉంటే ముస్లింలు 10 శాతం ఉన్నారు. అయితే ముస్లిం మహిళలకు రాష్ట్ర అసెంబ్లీలో ప్రాతినిథ్యం లేదు.

Exit mobile version