40 Arrested After Communal Clash In Gujarat: గుజరాత్ రాష్ట్రంలోని వడోదరా జిల్లాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. సోమవారం వడోదరాలోని సావ్లి పట్టణంలోని ఓ కూరగాయాల మార్కెట్ వద్ద ఇరువర్గాలు మధ్య అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలో వడోదల పోలీసులు మొత్తం 40 మందిని అరెస్ట్ చేశారు. సోమవారం సావ్లి పట్టణంలో ఓ వర్గం వారు మత జెండాలను ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టారు. దగ్లర్లో ఓ దేవాలయం ఉంది. దీంతో మరో వర్గం వారు నిరసన వ్యక్తం చేశారు. తమ మతపరమైన మనోభావాలు దెబ్బతీశారని మరో వర్గం వారు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాల మధ్య రాళ్లదాడి జరిగింది. రాళ్లదాడిలో పలు పోలీస్ వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఇరువర్గాలకు చెందిన 40 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు తెలిపారు.
Read Also: Dasara: దసరా ఉత్సవాల్లో విషాదం.. నృత్యం చేస్తూ యువకుడు, పాటలు పాడుతూ గాయకుడు మృతి
అంతకుముందు సోమవారం గర్బా వేదికపైకి రాళ్లు రువ్వారు ఓ వర్గం వ్యక్తులు. గుజరాత్ ఖేడా జిల్లా ఉండేలా గ్రామంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గర్భా నిర్వహిస్తున్న ప్రదేశానికి వచ్చిన ఆరిఫ్, జహీర్ అనే వ్యక్తులు తమ బృందంతో రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు గాయపడ్డారు. ఇద్దరు జవాన్లు కూడా గాయాల పాలయ్యారు. దీంతో ఉండేలా గ్రామంలో పోలీసులు పెద్ద మొత్తంలో మోహరించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘర్షణలతో ప్రమేయం ఉన్నవారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేది లేదని ఖేడా డీఎస్పీ వెల్లడించారు.