Noida Dowry Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్రేటర్ నోయిడా వరకట్న వేధింపుల మృతి కేసులో బిట్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అత్తింటివారే ఆమెపై కిరోసిన్ పోసి లైటర్ తో నిప్పంటించారని మృతురాలి సోదరి కంప్లైంట్ చేయగా, చనిపోయే ముందు నిక్కీ భాటి డాక్టర్లకు ఇచ్చిన మరణ వాంగ్మూలం దీనికి పూర్తి భిన్నంగా ఉన్నట్లు సమాచారం. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతోనే తనకు తీవ్ర గాయాలు అయ్యాయని నిక్కీ చెప్పినట్లు ఫోర్టిస్ హస్పటల్ వైద్యులు, నర్సులు పోలీసులకు వాంగ్మూలంలో చెప్పుకొచ్చారు.
Read Also: Mirai Trailer : మిరాయ్ ట్రైలర్ రిలీజ్.. విలన్ గా మంచు మనోజ్ అదరగొట్టాడుగా
అయితే, తీవ్ర గాయాలతో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి నిక్కీ తరలిస్తుండగానే మార్గమధ్యలో మృతి చెందింది. ఆమె శరీరం 80 శాతం కాలిన గాయాలైనట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ఈ ఘటనపై నిక్కీ సోదరి కంచన్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. తన ఆరేళ్ల కుమారుడి ముందే నిక్కీ భర్త విపిన్ భాటి, తన తల్లిదండ్రులతో కలిసి ఆమెను హత్య చేశారని ఆరోపించింది. పెళ్లి సమయంలో ఎస్‌యూవీ కారుతో పాటు విలువైన వస్తువులు ఇచ్చినా, అదనపు కట్నం కోసం నిక్కీని చాలా వేధించేవారని ఫిర్యాదులో వెల్లడించింది.
Read Also: Visakhapatnam: అమానుషం.. 8వ తరగతి విద్యార్థిపై టీచర్ దాడి.. మూడు చోట్ల విరిగిన ఎముకలు..!
ఇక, ఫోర్టిస్ హస్పటల్ డాక్టర్లు, నర్సులు మాత్రం పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంతో ఈ కేసులో కొత్త కోణం బయటకు వచ్చింది. నిక్కీ భాటిని ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు ఆమె మాట్లాడే పరిస్థితిలోనే ఉందని.. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతోనే తీవ్రంగా గాయపడ్డాను అని చెప్పినట్లు వారు పేర్కొన్నారు. ఫోర్టిస్ ఆసుపత్రి జారీ చేసిన మెమోలో కూడా ఇదే విషయాన్ని తెలిపారు. ఆసుపత్రి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, నిక్కీని ఆమె అత్తమామలు, పొరుగింటి వ్యక్తి దేవేంద్ర కారులో తీసుకువచ్చినట్లు గుర్తించారు పోలీసులు.
Read Also: Kotha Loka 1: Chandra : భారత తొలి మహిళా సూపర్ హీరో మూవీ ‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్ రిలీజ్!
కాగా, ఈ కేసులో నిక్కీ భర్త విపిన్ భాటి, అతని తల్లిదండ్రులు, సోదరుడు రోహిత్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిక్కీ సోదరి కంచన్‌ను రోహిత్ పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఆదివారం పోలీసు కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన విపిన్‌ను పోలీసులు కాలిపై కాల్చారు. అదనపు కట్నం కోసం వేధింపులతో పాటు అక్కా చెల్లెళ్లిద్దరూ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడం, బ్యూటీ పార్లర్ నడపడం లాంటి విషయాల్లో కూడా వీరి కుటుంబంలో గొడవలు జరిగినట్లు దర్యాప్తులో తేలింంది. బాధితురాలి మరణ వాంగ్మూలంతో కేసు అనేక అనుమానాలు దారి తీస్తుంది. ఇక, నిక్కీ కుటుంబంపై ఆమె వదిన (సోదరుడి భార్య) మీనాక్షి తీవ్ర ఆరోపణలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. తనను కూడా నిక్కీ పుట్టింటి వారు అదనపు కట్నం కోసం తీవ్రంగా హింసించారని పేర్కొంది.
