Vijay-Governor: విజయ్‌కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
- తమిళనాడులో ట్విస్ట్‌లు మీద ట్విస్ట్‌లు
- విజయ్ ప్రమాణస్వీకారానికి మళ్లీ బ్రేకులు
- చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
- నిలిచిపోయిన రేపటి విజయ్ ప్రమాణస్వీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో ట్విస్ట్‌లు మీద ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. గత ఐదు రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం సాయంత్రం గవర్నర్ అర్లేకర్‌ను విజయ్ కలిసి చిన్న పార్టీలు ఇచ్చిన మద్దతు లేఖలను అందజేశారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌ను గవర్నర్ ఆహ్వానించినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలన్నీ అవాస్తవం అని లోక్‌భవన్ కొట్టిపారేసింది. విజయ్‌ను ఇంకా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదని గవర్నర్ వర్గాలు పేర్కొన్నాయి.
విజయ్‌కు వామపక్షాలు మాత్రమే మద్దతు తెల్పాయి. వీసీకే, ముస్లిం లీగ్ పార్టీలు అంశాల వారీగా మాత్రమే మద్దతు ఇస్తామని ప్రకటించాయి. దీంతో విజయ్ బలం 116కు మాత్రమే చేరింది. దీంతో మ్యాజిక్ ఫిగర్ లేదని గవర్నర్ మెలిక పెట్టడంతో రేపటి ప్రమాణస్వీకారం ఆగిపోయింది.
Also Read
- Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
- Supreme Court: టెట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో ముందు సవాలు.. కోలుకోవడానికి దశాబ్దం పట్టే ఛాన్స్
- PMO Fake ID Case: ప్రధాని భద్రతలో కలకలం.. ఫేక్ PMO ఐడీ కేసులో ట్విస్ట్..
సోమవారం తమిళనాడు ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. విజయ్ నేతృత్వంలోని టీవీకే మాత్రమే అతి పెద్ద పార్టీగా అవతరించింది. 108 స్థానాలు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా నిలిచింది. మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం 10 స్థానాలు దూరంలో ఉంది. అయితే విజయ్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ తన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు ఇచ్చింది. దీంతో విజయ్ బలం 112కు చేరింది. దీంతో వామపక్షాలు, వీసీకే, ముస్లిం లీగ్ పార్టీల మద్దతు టీవీకే కోరింది. అయితే వామపక్షాలు మద్దతు తెల్పగా.. వీసీకే, ముస్లిం లీగ్ పార్టీల అంశాల వారీగా మద్దతు ఇస్తామని పేర్కొన్నాయి. దీంతో విజయ్ బలం 116 దగ్గర ఆగిపోయింది. మరో ఇద్దరు మద్దతు ఇస్తేనే గానీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్‌కు గవర్నర్ అనుమతించలేదు.
తాజావార్తలు
-
Police Recruitment: పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు.. ఎస్సై, కానిస్టేబుల్ జీతాల వివరాలు వెల్లడి..
-
Shivaji: “ఆ బూతులు అవసరమా అనిపించింది.. ట్రైలర్ చూసి నేనే షాక్ అయ్యా”.. ‘ఎపిక్’ ఈవెంట్లో శివాజీ బోల్డ్ కామెంట్స్!
-
Liquor Tenders: ఏపీలో మద్యం టెండర్లు.. ఎంఆర్పీ ధరలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
-
Naga Vamsi : ట్రైలర్లో ఆనంద్ ముద్దు సీన్.. ’90స్’ డైరెక్టర్‌పై ట్రోల్స్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నాగవంశీ!
-
Airlines: కీలక పండుగల వేళ ఛార్జీలకు రెక్కలు.. భారీగా పెంచేసిన విమాన సంస్థలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!