Site icon NTV Telugu

Government Teacher Arrested: 1వ క్లాస్‌ బాలికపై లైంగిక వేధింపులు.. ప్రభుత్వ ఉపాధ్యాయుడు అరెస్ట్..

Arrested

Arrested

Government Teacher Arrested: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని తికమ్‌గఢ్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. మొదటి తరగతి చదువుతున్న మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గురువారం ఉదయం మైనర్ బాలిక పాఠశాలకు వెళ్లిన సమయంలో అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పాఠశాల నుంచి ఇంటికి తిరిగివచ్చిన బాలిక ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Read Also: 9500s చిప్‌సెట్, ట్రిపుల్ రియర్ కెమెరా, భారీ బ్యాటరీతో ఫిబ్రవరిలోనే Xiaomi 17T Series లాంచ్?

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, కొంతమంది గ్రామస్తులతో కలిసి పలేరా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టంతో పాటు BNSలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుడైన ఉపాధ్యాయుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయమై తికమ్‌గఢ్ జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ.. పలేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు నమోదయ్యాయి. ఈ మేరకు నిందితుడిపై పోక్సో చట్టం, BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అతడిని అరెస్టు చేసి జైలుకు పంపించాం అని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

Exit mobile version